తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది, అదేవిధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు తిరుమల ప్రాంతంలో వర్షాలు కూడా కురిశాయి. అయినా కానీ, శ్రీవారి భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శ్రీవారి గరుడ సేవను తిలకించారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం రాత్రి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆ ఫోటోలు చూద్దాం.
1/6
తిరుమల
తిరుమల వాహన సేవల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన ఐదో రోజు గరుడ సేవ ఎంతో వైభవంగా సాగింది.
2/6
తిరుమల గరుడ సేవ 2026
అక్టోబర్ 16, 2026న తిరుమలలో నవరాత్రి ఉత్సవాల ఐదవ రోజు వేడుకలు జరుగుతున్నాయి. శ్రీ మలయప్ప స్వామి వారు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాలధారిగా దర్శనమిస్తూ భక్తులకు అభయం ఇచ్చారు.
3/6
శ్రీవారి గరుడ వాహన సేవ
స్వామి వారు మాడ వీధుల్లో విహరిస్తుండగా, గజరాజుల గంభీర నడకలు, మంగళ వాయిద్యాల మధ్య భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. గోవింద నామస్మరణతో నిండిన ఆ వాతావరణంలో, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు శ్రీవారి కోసం మాడ వీధుల్లో ఎదురుచూశారు.
4/6
నవరాత్రి బ్రహ్మోత్సవాలు
వైష్ణవ సంప్రదాయంలో గరుడ వాహన సేవకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. గరుడ వాహనంపై స్వామివారి విహారం భక్తి శరణాగతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇలా స్వామివారిని దర్శించుకోవడం వల్ల జన్మ ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు.
5/6
మలయప్ప స్వామి గరుడ సేవ
గ్యాలరీలో వేచి ఉన్న భక్తుల కోసం TTD సౌకర్యాలు కల్పిస్తోంది. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, అల్పాహారం, బిస్కెట్ ప్యాకెట్లు అందిస్తోంది. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
6/6
తిరుమల బ్రహ్మోత్సవాలు
ఈ గరుడ వాహన సేవలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, TTD చైర్మన్ బీఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.