తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఒక్కరోజే 83,578 మంది శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం రూ.5.7 కోట్లు. మీరు అక్టోబర్ నెలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకుంటే, అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ముందే ప్లాన్ చేసుకోండి. వాహన సేవలు ఎప్పుడు ఉన్నాయో ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1/7
తిరుమల
తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా జరుగుతూ, భక్తుల రద్దీతో నిరంతరం సందడిగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.
2/7
తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమలలో ఏడాది పొడవునా వివిధ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. గత నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగాయి. అక్టోబర్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 16న గరుడ వాహనం, 17న పుష్పక విమానం, అక్టోబర్ 19న స్వర్ణ రథం, 20న చక్రస్నానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
3/7
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు
సాధారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చాంద్రమానం ప్రకారం అధికమాసం వచ్చినప్పుడు నిర్వహిస్తారు. అటువంటి సందర్భంలో భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా సమయంలో ఆశ్వీయుజ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
4/7
తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్
ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి వాహన సేవలు ప్రారంభమై రాత్రి 11:30 గంటల వరకు కొనసాగుతాయి. అక్టోబర్ 11వ తేదీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత వాహన సేవలు మొదలవుతాయి.
5/7
టీటీడీ
మొదటిరోజు, అక్టోబర్ 12న ఉదయం 9 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు విహరిస్తారు. అక్టోబర్ 13న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ ఉంటుంది. అక్టోబర్ 14న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవలు నిర్వహిస్తారు.
6/7
శ్రీవారి గరుడ సేవ
మరుసటి రోజు, అక్టోబర్ 15న కల్పవృక్ష వాహనం, అదే రోజు రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ ఉంటుంది. అక్టోబర్ 16న మోహిని అవతారం ఉండనుంది. సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. 17న హనుమంత వాహనం, సాయంత్రం పుష్పక విమాన సేవలతో స్వామివారు విహరిస్తారు.
7/7
తిరుమల తిరుపతి దేవస్థానం
రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ ఉంటుంది. ఇక అక్టోబర్ 18న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. అక్టోబర్ 19న స్వర్ణ రథంపై స్వామివారు విహరించనుండగా, అదే రోజు రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై విహరిస్తారు. అక్టోబర్ 20న ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. దీంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.