తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 83,609 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 24,816 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే, ఈనెల 16వ తేదీనా తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
తిరుమల పుష్పయాగం 2026
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో నిత్యం భక్తులకు కిటకిటలాడుతుంది. వివిధ వేడుకలు, బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈనెల 16వ తేదీనా కూడా తిరుమలలో పుష్పయాగం నిర్వహిస్తున్నారు.
2/5
తిరుమల ఆర్జిత సేవలు రద్దు
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. దీనికి ముందు రోజు నవంబర్ 15న అంకురార్పణ కూడా చేయనున్నారు. రెండో రోజు పుష్పయాగం రోజున స్పపన తిరుమంజనం కూడా చేస్తారు.
3/5
నవంబర్ 16 తిరుమల అప్‌డేట్స్
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు ఇతర సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం నిర్వహిస్తారు. ఇక అదేరోజు మధ్యాహ్నం రకరకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహిస్తారు. సహస్రదీపాలంకరణ తర్వాత తిరమల మాడవీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
4/5
తిరుమల తిరుపతి దేవస్థానం
ఈనెల 16వ తేదీనా నిర్వహిస్తున్న పుష్పయాగం సందర్భంగా ఆరోజు జరగాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.
5/5
తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. నిన్న ఒక్కరోజే 83,609 మంది దర్శించుకోగా.. అందులో 24,816 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే రూ.3.95 కోట్లు వచ్చింది.