నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరా భావన సంవత్సరం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 17వ తేదీ, శనివారం. పండితుల అభిప్రాయం ప్రకారం ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుట్టకూడదు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందే రాశులు ఏంటో తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఒత్తిడికి లోనుకాకుండా ఉండండి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
2/5
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ప్రయాణాలు వాయిదా వేయండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టకండి. కొత్త ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అనుకూల పరిస్థితులు కలిసి వస్తాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు, ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు మరియు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
4/5
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభకరంగానే ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కూడా శుభ వార్త అందుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది మరియు సమాజంలో గౌరవం లభిస్తుంది.
5/5
మీన రాశి
మీన రాశి వారికి కూడా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచన ఉంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)