నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపరాభవ నామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం, అక్టోబర్ 27 మంగళవారం ప్రత్యేకం. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయాల్సిన రాశులు ఏవి? ఏ రాశివారు కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశివారికి ఈరోజు శుభప్రదమైన రోజు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. ఆర్థిక లాభాలు కలిగే సూచన ఉంది.
2/5
మిథున రాశి
మిథున రాశివారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న ప్రతి పని జరుగుతుంది. అన్ని పనులు సజావుగా సాగడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. కుటుంబంలో సఖ్యతను పెంచుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈరోజు శుభప్రదమే. పని ప్రదేశంలో మంచి ప్రశంసలతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్తను వింటారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అన్నీ శుభవార్తలే.
4/5
సింహ రాశి
సింహ రాశివారు కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటారు. అయితే ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. నిర్ణయాలను ఆచితూచి తీసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది.
5/5
కుంభ రాశి
కుంభ రాశివారికి ఈరోజు ఆనందంగా సాగిపోయే రోజు. వ్యాపారాలకు కూడా కలిసివస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు, అది ఆర్థికంగా కలిసివస్తుంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)