• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Vishnu Priya: మూడు సార్లు బ్రేకప్.. భర్త విషయంలో విష్ణుప్రియ క్లారిటీ

Vishnu Priya: మూడు సార్లు బ్రేకప్.. భర్త విషయంలో విష్ణుప్రియ క్లారిటీ

Written ByVishnu Priya
Published: Oct 01, 2026, 23:05 IST|Updated: Oct 01, 2026, 23:11 IST
joinshare

Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు మూడు సార్లు బ్రేకప్ అయ్యిందని, రెండో బ్రేకప్ నుంచి బయటపడటానికి మూడేళ్లు పట్టిందని తెలిపారు. అలాగే భవిష్యత్ భర్త బ్యాలెన్స్‌గా ఉండే వ్యక్తి కావాలని చెప్పారు.
 

 Vishnu Priya Latest News1/5

విష్ణుప్రియ లేటెస్ట్ న్యూస్

విష్ణుప్రియ మాట్లాడుతూ తనకు ఇప్పటివరకు మూడు సార్లు బ్రేకప్ అయ్యిందని చెప్పారు. అందులో రెండో బ్రేకప్ నుంచి బయటపడటానికి దాదాపు మూడేళ్లు పట్టిందని తెలిపారు. ఆ సమయంలో చాలా బాధపడ్డానని, కొన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించానని చెప్పారు. ఏడుస్తూ తన బాధను తగ్గించుకున్నానని, చివరకు జరిగిన విషయాలను అంగీకరించడం నేర్చుకున్నానని వివరించారు.
Vishnu Priya Interview2/5

విష్ణుప్రియ ఇంటర్వ్యూ

బ్రేకప్ సమయంలో మెడిటేషన్ తనకు ఎంతో ఉపయోగపడిందని విష్ణుప్రియ చెప్పారు. మన శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు ఆలోచనలను కొంతవరకు నియంత్రించుకోవచ్చని తెలిపారు. ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ సంబంధం కొనసాగకపోవడం కూడా తన జీవితానికి మంచిదే అయి ఉండొచ్చని ఆమె అన్నారు.
Vishnu Priya Breakups3/5

విష్ణుప్రియ మూడు బ్రేకప్స్

తన భవిష్యత్ భర్త ఎలా ఉండాలనే ప్రశ్నకు కూడా విష్ణుప్రియ స్పష్టంగా సమాధానం ఇచ్చారు. జీవితంలో బ్యాలెన్స్‌గా ఉండే వ్యక్తి తనకు కావాలని చెప్పారు. అంటే వ్యక్తిగత జీవితం, కుటుంబం, బాధ్యతలను అర్థం చేసుకుని సమతుల్యంగా ముందుకు వెళ్లే వ్యక్తి కావాలని ఆమె అభిప్రాయం.
Vishnu Priya Personal Life4/5

విష్ణుప్రియ పర్సనల్ లైఫ్

ఇక కెరీర్ ప్రారంభ రోజుల్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని విష్ణుప్రియ తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ఆదాయం రావడం మొదలైన తర్వాత పరిస్థితులు కొంత మారాయని చెప్పారు. బిగ్‌బాస్‌లో పాల్గొన్న సమయంలో ఇల్లు కొనాలనే ఆలోచన కూడా తనకు ఉండేదని వెల్లడించారు.
 Vishnu Priya Talk Show5/5

విష్ణుప్రియ టాక్ షో

కుటుంబం కోసం కూడా తాను చాలా కష్టపడ్డానని విష్ణుప్రియ చెప్పారు. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో భారీగా డబ్బు అవసరమైందని తెలిపారు. అలాగే తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు తయారు చేయడం వల్ల చాలా మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. డబ్బు జీవితంలో సౌకర్యాలను ఇవ్వగలదని, కానీ మనశ్శాంతిని మాత్రం ఇవ్వలేదని విష్ణుప్రియ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
TAGS:
Tollywood
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.