Samantha and Tamannaah: సమంత టాక్ షోలో తమన్నా భాటియా పాల్గొన్న సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు మరోసారి అందరిని ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీల గురించి సమంత అడిగిన ప్రశ్నలకు.. తమన్నా ఇచ్చిన సరదా సమాధానాలు ప్రేక్షకులను ఎంతగానో మోపించాయి.
1/5
తమన్నా భాటియా
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సమంత, తమన్నా భాటియా కూడా ఉన్నారు. ఇద్దరూ ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. గతంలో సమంత నిర్వహించిన ప్రముఖ టాక్ షోకు తమన్నా గెస్ట్‌గా వచ్చింది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి చేసిన సందడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
2/5
మహేష్ బాబు జుట్టు
ఆ టాక్ షోలో సమంత, తమన్నా సినిమాలు, హీరోలు, వ్యక్తిగత విషయాల గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది. ముందుగా సమంత.. తమన్నాను తనకు నచ్చిన కోస్టార్‌తో డేట్ చేయాలనుకుంటుందా అని అడిగింది. దీనికి తమన్నా సరదాగా సమాధానం ఇచ్చింది. గతంలో అలాంటి ఆలోచన ఉండేదని, కానీ ఇప్పుడు తనకు నచ్చిన కోస్టార్లలో చాలామంది పెళ్లి చేసుకున్నారని చెప్పింది.
3/5
సమంత తమన్నా
ఆ తర్వాత సమంత ర్యాపిడ్ ఫైర్‌లో భాగంగా కొంతమంది సెలబ్రిటీల నుంచి ఏం దొంగిలించాలనుకుంటుందో తమన్నాను అడిగింది. ముందుగా రానా దగ్గుబాటి పేరు వచ్చింది. రానా నుంచి ఏం తీసుకోవాలనుకుంటావని సమంత అడగ్గా.. తమన్నా వెంటనే అతని ఎత్తు కావాలని చెప్పింది. రానా తన పొడవైన శరీరాకృతితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
4/5
సెలబ్రిటీ ర్యాపిడ్ ఫైర్
తమన్నా సమాధానం విన్న సమంత కూడా తనకు రానా ఎత్తు కావాలని చెప్పింది. ఇద్దరం కలిసి రానా ఎత్తులో కొన్ని అంగుళాలు తీసుకున్నా.. అతను ఇంకా చాలా పొడుగ్గానే ఉంటాడని తమన్నా సరదాగా చెప్పింది. దీంతో షోలో నవ్వులు పూశాయి. ఆ తర్వాత సమంత.. కాజల్ అగర్వాల్ నుంచి ఏం దొంగిలించాలనుకుంటావని అడిగింది. దీనికి తమన్నా కాజల్ కళ్లను ఎంచుకుంది. కాజల్ అందమైన, ఎక్స్‌ప్రెసివ్ కళ్లకు మంచి గుర్తింపు ఉంది.
5/5
తమన్నా వార్తలు
తర్వాత సమంత సూపర్‌స్టార్ మహేష్ బాబు పేరు చెప్పింది. మహేష్ బాబు నుంచి ఏం తీసుకోవాలనుకుంటావని అడగ్గా.. తమన్నా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతని జుట్టు కావాలని చెప్పింది. తమన్నా ఇచ్చిన ఈ సరదా సమాధానాలు అప్పట్లో అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రానా ఎత్తు, మహేష్ బాబు జుట్టుపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పటికీ ఆసక్తికరంగా అనిపిస్తాయి. సమంత, తమన్నా మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్‌కు ఈ టాక్ షో సంభాషణ మంచి ఉదాహరణగా నిలిచింది.