• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Suma Biopic: సుమ బయోపిక్‌లో ఎవరు నటిస్తారు.. రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Suma Biopic: సుమ బయోపిక్‌లో ఎవరు నటిస్తారు.. రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Written ByVishnu Priya
Published: Oct 15, 2026, 08:44 AM IST|Updated: Oct 15, 2026, 08:49 AM IST
joinshare

Suma Biopic: ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ మొదలైంది. సుమ జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఆమె పాత్రలో ఏ హీరోయిన్ నటిస్తే బాగుంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి.
 

 Raghu Rama Krishna Raju Comments1/5

గరివిడి లక్ష్మి ప్రీ రిలీజ్ ఈవెంట్

‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రఘురామకృష్ణరాజు, తేజ సజ్జ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకకు సుమ యాంకరింగ్ చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు సుమ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Garividi Lakshmi Pre Release Event2/5

యాంకర్ సుమ వార్తలు

ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి తన జీవితంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె జీవిత కథ ఆధారంగా ఇప్పుడు సినిమా తెరకెక్కింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన రఘురామకృష్ణరాజు.. సుమ సాధించిన విజయాలను కూడా గుర్తు చేశారు.
Suma Latest News3/5

సుమ లేటెస్ట్ న్యూస్

"గరివిడి లక్ష్మి పదివేల షోలు చేశారంట. కానీ సుమ స్టార్ మహిళ ఒక్కటే పదివేలకు పైగా ఎపిసోడ్లు చేశారు. కాబట్టి ఆమె బయోపిక్ కూడా త్వరలోనే వస్తుంది. మరి ఆమె బయోపిక్‌లో సుమను ఎవరు నటిస్తారో చూడాలి" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న వారిలో ఆసక్తిని కలిగించాయి. సుమ తన యాంకరింగ్‌తో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన మాటలతో, చమత్కారంతో సినిమా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.
Telugu Anchor Suma4/5

సుమ పాత్రలో ఎవరు నటిస్తారు?

సుమ తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో టీవీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడంతో పాటు, అనేక సినిమా వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.
Suma Life Story5/5

సుమ బయోపిక్ హీరోయిన్

సుమ జీవితంలో ఎదురైన సవాళ్లు, ఆమె ఎదుగుదల, టెలివిజన్ రంగంలో సాధించిన విజయాలతో బయోపిక్ తీస్తే ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, సుమ బయోపిక్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ నిజంగానే సుమ జీవిత కథ సినిమాగా తెరకెక్కితే ఆమె పాత్రలో ఎవరు నటిస్తారు? తన హావభావాలతో, మాటలతో సుమను పోలిన నటి ఎవరు? అనే ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.
TAGS:
Tollywood
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
అక్టోబర్ 15 నుంచి త్రికోణ యోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు, బిగ్‌ జాక్‌పాట్‌!

అక్టోబర్ 15 నుంచి త్రికోణ యోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు, బిగ్‌ జాక్‌పాట్‌!

2

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సరే.. మరి 12 వేల ప్రాథమిక పాఠశాలలు..3వేల అప్పర్ ప్రైమరీ స్కూళ్ల భవిష్యత్తేంటి?

3

గాడిద చెప్పిన భవిష్యత్తు...అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు అని చెబుతున్న నీతి కథ..!!

4

4 ఏళ్ల ప్రేమకు ఒక్క రోజే ఆయువు! ఉదయమే పెళ్లి.. సాయంత్రానికే విడిపోయారు! అసలు ఆ ఒక్క రోజులో ఏం జరిగింది?

5

Telangana Power Cuts: విద్యుత్‌ కోతలపై తెలంగాణ సీఎం తీవ్ర ఆగ్రహం.. నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.