• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /2027లో ఈ 4 రాశులకు మహర్దశ.. గురు, శని సంచారంతో పట్టిందల్లా బంగారమే!

2027లో ఈ 4 రాశులకు మహర్దశ.. గురు, శని సంచారంతో పట్టిందల్లా బంగారమే!

2027 Horoscope Predictions: 2027 సంవత్సరంలో ప్రధాన గ్రహాల సంచారాల కారణంగా ఈ క్రింది రాశుల వారికి అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలకు అద్భుతమైన ఫలితాలు లభించబోతున్నాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు కూడా ఈ ఏడాదిలో చేయబోతున్నారు. అయితే ఎక్కువ లాభాలు కలిగే రాశులేవో జ్యోతిష్యులు నాగరాజు శర్మ మాటల్లో తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 22, 2026, 10:40 IST|Updated: Nov 22, 2026, 10:41 IST
joinshare
2027లో ఈ 4 రాశులకు మహర్దశ.. గురు, శని సంచారంతో పట్టిందల్లా బంగారమే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

2027 Horoscope Predictions: కొత్త సంవత్సరం 2027 ప్రారంభం కావడానికి కేవలం 40 రోజులు మాత్రమే సమయం ఉంది.. అయితే చాలామంది ఈ సంవత్సరంలో వారి జాతకం ఎలా ఉంటుందని ఆసక్తితో ఇప్పటికే గూగుల్ సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన గ్రహాలుగా భావించే గురు, శని, రాహువు, కేతువు గ్రహాలు సంచారం చేసి మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ఈ 2027 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి వ్యాపారాలపరంగా కొత్త కొత్త అవకాశాలు లభిస్తే.. మరికొన్ని రాశుల వారికి ఊహించని స్థాయిలో ధన లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించబోతున్నారు. అయితే, ఈ 2027 సంవత్సరం ఎక్కువగా ఏ రాశుల వారికి మేలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి లాభాలు..
మేషరాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతోషం విపరీతంగా పెరగడమే కాకుండా జూన్ 2027 సంవత్సరం వరకు ఎంతో అనుకూలంగా ఉంటుందని.. ముఖ్యంగా ఏలినాటి శని నుంచి కాస్తయినా ఉపశమనం లభిస్తుందని ఆయన తెలిపారు. ఆస్తులు కొనుగోలు చేసే వారికి ఈ సమయం లాభదాయకంగా కూడా మారుతుంది. పెళ్లిలు కాని వ్యక్తులకు తప్పకుండా మంచి భాగస్వామి లభించబోతోంది. అలాగే పిల్లలతో కూడా ఎంతో సంతోషంగా గడపగలుగుతారని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతూ ఉన్నారు..

మిధున రాశి 
మిధున రాశి వారికి కూడా ఈ సమయంలో అనేక రకాల ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో అద్భుతమైన పరిచయాలు ఏర్పడడమే కాకుండా.. కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించబోతున్నాయి. వృత్తి వ్యాపార రంగాల్లో సానుకూల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబంలో అద్భుతమైన శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. అలాగే రాహు ప్రభావంతో ఆధ్యాత్మికంగా కూడా చాలా కలిసి రాబోతోంది. మానసిక ప్రశాంతత కూడా చాలా వరకు పెరిగి.. ఒత్తిడి తగ్గిపోతుంది..

కర్కాటక రాశి 
2027 సంవత్సరం కర్కాటక రాశి వారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉండబోతుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా సులభంగా లభిస్తుందని.. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరి ఆరోగ్యం ఈ సమయంలో చాలావరకు బాగుండబోతోంది. మానసిక ప్రశాంతత లభించి జూలై ఆగస్టు నెలలో వీరు తప్పకుండా కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతూ ఉన్నారు..

సింహరాశి 
2027వ సంవత్సరంలో సింహ రాశి వారికి అనేక రకాల విజయాలు కలుగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. వీరికి ఈ సమయంలో తప్పకుండా ఆత్మవిశ్వాసం పెరిగి కొన్ని రకాల పనులు సులభంగా చేయగలుగుతారు. అలాగే కొత్త సంబంధాల కారణంగా వీరు తప్పకుండా ఆర్థికంగా రాణించగలుగుతారు. ముఖ్యంగా విద్యారంగాలలో పనులు చేస్తున్న వ్యక్తులకు రెట్టింపు లాభాలు కలుగుతాయి. జీవితంలో అనుకున్న పనులు సులభంగా చేసి ఎన్నో రకాల ప్రయోజనాలు సొంతం చేసుకోగలుగుతారు. నిలిచిపోయిన పనులు కూడా మళ్లీ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా సింపుల్గా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు..
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Rasi Phalalu