Papankusha Ekadashi: పాపంకుశ ఏకాదశి ప్రభావం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ తో లగ్జరీలైఫ్.. మీరున్నారా..?..
Ekadashi lucky zodiac signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం అక్టోబర్ 21న పాపంకుశ ఏకాదశిని జరుపుకుంటాం. దీని ప్రభావం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అనుకొని విధంగా ధనలాభాలు కల్గుతాయి.
Papankusha ekadashi Effect most lucky zodiac signs: దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగింపుకు వచ్చాయి. తొమ్మిదవ రోజు సైతం దుర్గమ్మ తల్లిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. పలుచోట్ల అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం కార్యక్రమం కూడా చేశారు. అయితే.. అక్టోబరు 21న మనం పాపంకుశ ఏకాదశిని జరుపుకుంటాం. ఏకాదశి అనేది శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథిగాచెబుతుంటారు.ఈ రోజున ముఖ్యంగా విష్ణు సహాస్రనామాపారాయణం, సత్యనారాయణ వ్రతం, నదీస్నానం, జపాలు,హోమాలు చేయాలని చెప్తారు. ఈరోజున మనం చేసే పూజలు, వ్రతాలు వెయ్యిరెట్లు గొప్ప శుభఫలితాలను ఇస్తాయి. అందుకే తప్పనిసరిగా శక్తికొలది దైవతారాధన చేయాలని పండితులు చెబుతున్నారు.
ఇదే రోజున అత్యంత శక్తివంతమైన పారిజాత యోగం ఏర్పడటంవల్ల దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనుంది. ఈక్రమంలో కొన్ని రాశుల వారికి జీవితంలో ఈ సమయంలో గొప్ప మార్పులు సిద్దించబోతున్నాయి. ఆరాశులు ఏంటో చూద్దాం..
మిథునం.. ఈ రాశుల వారికి ఏకాదశి ప్రభావం వల్ల ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాల వస్తాయి.
సింహం.. ఈ రాశుల వారికి పారిజాతయోగం ప్రభావం వల్ల భార్యతరపు ఆస్తులు కలిసి వస్తాయి. రాజకీయాల్లో రాణిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యా, ఉద్యోగాల్లో రాణిస్తారు. ప్రభుత్వఉద్యోగాలు సాధిస్తారు. వీరికిఈ సమయం గోల్డెన్ డేస్ అని చెప్పుకొవచ్చు.
తుల..ఈ రాశుల వారిక పెళ్లిలో వస్తున్న ఆటంకాలు దూరమౌతాయి. లాటరీలు తగిలే చాన్స్ కన్పిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. విదేశీయానం కన్పిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లోరాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మీరు పెట్టే పెట్టుబడి లాభాల్ని తెచ్చిపెడుతుంది.
ధనస్సు.. వీరికి ఆకస్మిక ధనలాభం కన్పిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. సొంతింటి కల సాకారం అవుతుంది. బంధువులతో, సోదరులతో విహర యాత్రలు చేస్తారు. మొత్తంగా లగ్జరీ లైఫ్ ను సొంతం చేసుకుంటారు. ( గమనిక - ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీతెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)