• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు? మన పూర్వీకులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఇవే!

కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు? మన పూర్వీకులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఇవే!

Amla Tree Significance in Kartika Masam: భారతీయ సాంస్కృతిలో ఉసిరికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు.. ముఖ్యంగా కార్తీక మాస సమయంలో ఉసిరి పై నెయ్యి వేసి దీపం వెలిగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయట..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 15, 2026, 11:57 AM IST|Updated: Nov 15, 2026, 11:59 AM IST
joinshare
కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు? మన పూర్వీకులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఇవే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలుగు సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరెంత  తీసుకొంటున్నారంటే..!!

తెలుగు సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరెంత తీసుకొంటున్నారంటే..!!

2

కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? అసలు రహస్యం ఇదే!

3

కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు? మన పూర్వీకులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఇవే!

4

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

5

కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఎవరికి దానం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Amla Tree Significance in Kartika Masam: భారతీయ సంస్కృతితో పాటు ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఉసిరి చెట్టు, ఉసిరికాయలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం వెలిగించడంతోపాటు ఉసిరి చెట్టు నీడన భోజనం చేయడం తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం.. అయితే, దీని వెనక కేవలం భక్తి భావం మాత్రమే కాకుండా లోతైన ఆధ్యాత్మిక అర్థంతో పాటు అద్భుతమైన ఆయుర్వేద విజ్ఞానం దాగి ఉన్నాయని పండితులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఉసిరి దీపాన్ని వెలిగించడం ఎందుకు మంచిది? కార్తీక మాసంలో మాత్రమే ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం.. ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు.. ధాత్రి అంటే తల్లి అని అర్థం.. సకల జీవరాశులను పోషించే తల్లిగా ఉసిరి చెట్టు ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని స్కంద పద్మ పురాణాల్లో పేర్కొన్నారు.. ఉసిరికాయపై ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి.. సానుకూల తరంగాలు వ్యాప్తిస్తాయని.. దీని కారణంగా దారిద్రం కూడా నశించి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం..

శీతాకాలం ప్రారంభమయ్యే సమయంలో వాతావరణం లో వచ్చే మార్పుల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఉసిరి చెట్టు గాలిని పీల్చుకోవడంతోపాటు దాని నీడలో గడపడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఉసిరిని అమృతఫలంగా పిలుస్తూ ఉంటారు. ఇందులో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆ చెట్టు ఆకులతో పాటు కాయలనుంచి వచ్చే ఔషధ గుణాలు కలిగిన స్వచ్ఛమైన గాలి శ్వాసకోశ వ్యాధులను ఈ సులభంగా నివారించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఉసిరికాయ దీపం వెలిగించినప్పుడు నెయ్యితో పాటు ఉసిరి సమ్మేళనాలతో వెలువడే పొగ వాతావరణం లోని సూక్ష్మ క్రిములను సులభంగా తొలగిస్తుంది. దీనివల్ల మనసు ప్రశాంతతను కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉన్నారు..

మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవించేలా.. ఆరోగ్య సూత్రాలను ఆచరణల రూపంలో మనకు అందించారు.. ఉసిరి దీపారాధన తో పాటు వనభోజనాలు కేవలం ఆధ్యాత్మిక తృప్తిని అందించడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని.. శరీర దృఢత్వాన్ని ప్రసాదించే గొప్ప ప్రక్రియ గా నిలుస్తూ ఉన్నాయి.. కాబట్టి కార్తీక మాస సమయంలో అందరూ ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉసిరికాయలతో పచ్చళ్ళు చేసుకొని తింటూ ఉంటారు. దీనివల్ల బంపర్ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Spirituality