• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /తెలుగు సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరెంత తీసుకొంటున్నారంటే..!!

తెలుగు సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరెంత తీసుకొంటున్నారంటే..!!

చిరంజీవి.. (Chiranjeevi)..మెగాస్టార్ చిరంజీవి ఒక్కో చిత్రానికి దాదాపు రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ‘కాకా’ సినిమా ఏకంగా దాదాపు రూ.50 కోట్ల వరకు అందుకోబోతున్నట్టు  సమాచారం. ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తోన్న ‘మెగావర్స్’ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 15, 2026, 12:09 PM IST|Updated: Nov 15, 2026, 12:13 PM IST
joinshare
తెలుగు సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరెంత  తీసుకొంటున్నారంటే..!!
Image Credit: Telugu Senior Heroes remunaration (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
CM Revanth reddy: దేశ రాజకీయల్లో కీలక పరిణామం.. ప్రధాని మోదీతో భేటి అయిన సీఎం రేవంత్.. అసలు విషయం ఇదేనా..?..

CM Revanth reddy: దేశ రాజకీయల్లో కీలక పరిణామం.. ప్రధాని మోదీతో భేటి అయిన సీఎం రేవంత్.. అసలు విషయం ఇదేనా..?..

2

తెలుగు సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరెంత తీసుకొంటున్నారంటే..!!

3

కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? అసలు రహస్యం ఇదే!

4

కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు? మన పూర్వీకులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఇవే!

5

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

చిరంజీవి.. (Chiranjeevi)..
మెగాస్టార్ చిరంజీవి ఒక్కో చిత్రానికి దాదాపు రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ‘కాకా’ సినిమా ఏకంగా దాదాపు రూ.50 కోట్ల వరకు అందుకోబోతున్నట్టు  సమాచారం. ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తోన్న ‘మెగావర్స్’ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.

బాలకృష్ణ (Balakrishna Nandamuri)..
నందమూరి బాలకృష్ణ.. వరుస సక్సెస్‌ల నేపథ్యంలో ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ ను రూ. 25 కోట్లకు పెంచారు. ప్రస్తుతం చేస్తోన్న ‘దాదా’ కోసం గోపీచంద్ మలినేని సినిమా కోసం ఏకంగా రూ. 40 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట.  

నాగార్జున (Nagarjuna Akkineni)..

అక్కినేని నాగార్జున ఒక్కో చిత్రం కోసం దాదాపు రూ. 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. తాజాగా ‘కింగ్ 100’ కోసం దాదాపు రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

వెంకటేష్ (Venkatesh.)..
విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. రీసెంట్‌గా ‘ఆదర్శ కుటుంబం’  కోసం రూ. 20 కోట్లు తీసుకున్నట్టు సమాచారం.  

రవితేజ (Ravi Teja)..

రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.‘ఇరుముడి’ సక్సెస్ తర్వాత తన రెమ్యునరేషన్‌ను మరో రూ. 5 కోట్ల వరకు  పెంచినట్టు సమాచారం. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie