• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? అసలు రహస్యం ఇదే!

కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? అసలు రహస్యం ఇదే!

Karthika Masam Food Rules: కార్తీక మాసంలో చాలామంది దీపారాధన చేయడమే కాకుండా ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వెల్లుల్లి కలిగిన ఆహారాలను తినేందుకు దూరంగా ఉంటారు. ఈ సమయాల్లో ఎందుకు వెల్లుల్లి తినరు? దీని వెనక ఉన్న అసలైన కారణాలేంటి? పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 15, 2026, 12:04 PM IST|Updated: Nov 15, 2026, 12:06 PM IST
joinshare
కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? అసలు రహస్యం ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
CM Revanth reddy: దేశ రాజకీయల్లో కీలక పరిణామం.. ప్రధాని మోదీతో భేటి అయిన సీఎం రేవంత్.. అసలు విషయం ఇదేనా..?..

CM Revanth reddy: దేశ రాజకీయల్లో కీలక పరిణామం.. ప్రధాని మోదీతో భేటి అయిన సీఎం రేవంత్.. అసలు విషయం ఇదేనా..?..

2

తెలుగు సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరెంత తీసుకొంటున్నారంటే..!!

3

కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? అసలు రహస్యం ఇదే!

4

కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారు? మన పూర్వీకులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఇవే!

5

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Karthika Masam Food Rules: కార్తీక మాసం అడుగుపెట్టగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శోభ దీపం లాగా వెలిగిపోతూ ఉంటుంది.. దీపారాధనలతో పాటు ఉపవాసాలు, వనభోజనాలు.. ఇలా చాలామంది అత్యంత నిష్టతో పాటించే మరో ముఖ్యమైన నియమా ఉల్లి వెల్లుల్లి తినకపోవడం.. సాధారణంగా దీనిని కేవలం ఒక మతపరమైన ఆచారంగా మాత్రమే భావిస్తూ ఉంటారు. కానీ దీని వెనక మన పూర్వీకులు అనే రకాల విషయాలను రహస్యాలను అందించారు. అంతేకాకుండా దీని వెనక ఆయుర్వేద విజ్ఞానం కూడా దాగి ఉందని పూర్వీకులు తెలుపుతూ వస్తున్నారు..

కార్తీక మాసం అనేది శరదృతువు ముగిసి.. హేమంత రుతువు ప్రారంభమయ్యే సంధికాలంగా చెబుతూ ఉంటారు. రుతుపవనాల మార్పు వల్ల వాతావరణం లో ఒక్కసారిగా తేమ తగ్గి.. చలి తీవ్రత విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. వాతావరణం లో ఈ మార్పులు సంభవించినప్పుడు మానవ శరీరంలో జీర్ణశక్తి సహజంగానే మందగిస్తూ వస్తుంది. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాక.. గ్యాస్ తో పాటు అజీర్తి, మలబద్ధకం కఫ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది..

ఆయుర్వేద ఆహార పదార్థాలను మూడు రకాలుగా విభజించారు.. సాత్విక, రజసిక, తామసిక ఆహారాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఉల్లిపాయను రజసిక గుణం కలిగిన దానిగా భావిస్తారు. వెల్లుల్లిని తామసిక గుణం కలిగిందిగా చెప్పుకుంటారు.. ఉల్లి వెల్లుల్లి శరీరంలో వేడిని అధికంగా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి మందగించిన జీర్ణ వ్యవస్థ పై మరింత భారాన్ని మోపుతూ ఉంటాయి.. రజసిక తామసిక ఆహారాలు మనస్సులో చంచలత్వాన్ని.. కోపాన్ని, ఆవేశాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో చేసే జప తప ధ్యానాలకు ఏకాగ్రతతో పాటు ప్రశాంతత ఎంతో అవసరం అందుకే మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి వీటిని దూరం పెట్టాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు..

సంవత్సరాల పొడవునా మసాలాలతో పాటు గాటైన పదార్థాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణాశయంతో పాటు కాలేయం నిరంతరం పనిచేస్తూ అలసిపోతూ ఉంటాయి. కార్తీక మాసంలో కనీసం 30 రోజులపాటు ఉల్లితో పాటు వెల్లుల్లి లేని తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు పూర్తిస్థాయి విశ్రాంతి లభిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపే ఒక సహజమైన డిటెక్స్ ప్రక్రియలా పనిచేసి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కార్తీక మాసంలో ఉల్లితో పాటు వెల్లుల్లి తినకపోవడం అనేది కేవలం మూఢనమ్మకం లేదా ఆచారం మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణoకి అనుగుణంగా మన శరీరాన్ని.. మనసును సిద్ధం చేసుకోవడమేనని పూర్వీకులు చెబుతున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Spirituality