SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ 11న అరుదైన అమృత సిద్ధి యోగం.. ఈ 4 రాశులకు కనీవినీ ఎరుగని ధనలాభాలు!

Amrit Siddhi Yoga: నవంబర్ 11న ఎంతో శక్తివంతమైన అమృత సిద్ధి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎప్పుడు పొందలేని ధన లాభాలు కూడా సులభంగా సొంతం చేసుకుంటారు. అయితే, ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 10, 2026, 09:32 AM IST | Updated: Nov 10, 2026, 09:34 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Amrit Siddhi Yoga Effect: జ్యోతిష్య శాస్త్రంలో అమృత సిద్ధి యోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ యోగ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించి.. ఏదైనా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ సమయంలో పెడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే నంబర్‌ నెలలో ఎంతో శక్తివంతమైన అమృత సిద్ధి యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

2026 నవంబర్ 11వ తేది బుధవారం ఉదయం 06 గంటల నుంచి ఉదయం 11:38 గంటల వరకు ఈ అరుదైన యోగం కొనసాగబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆ రోజున బుధవారంతో పాటు అనురాధ నక్షత్రం కలయిక ఏర్పడటం వల్ల ఈ పవిత్ర అమృత సిద్ధి యోగం సిద్ధిస్తోందని నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ శుభ సమయంలో చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి.. అద్భుతమైన విజయాలు కలుగుతాయని.. ముఖ్యంగా నాలుగు రాశులవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు..
సింహ రాశి
అమృత సిద్ధి యోగంతో సింహ రాశివారికి కెరీర్‌ పరంగా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం లాభదాయకంగా ఉండి.. ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేయాలనుకునేవారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. సమాజంలో హోదా, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబాల పరంగా వస్తున్న వ్యాపారాలు కూడా చాలా వరకు పుంజుకునే ఛాన్స్‌లు ఉన్నాయి.

తులా రాశి
తులారాశివారికి కూడా ఈ యోగం ప్రభావంతో ఆర్థికంగా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. కుటుంబ పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కొత్త ఇల్లు, స్థలం లేదా నూతన వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి బంపర్‌ లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా షేర్లు కూడా కొనుగోలు చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రావాల్సి మోండి బాకీలు కూడా లబిస్తాయి.

వృషభ రాశి
అమృత సిద్ధి యోగంతో వృషభ రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా వాయిదాలు పడుతున్న పనులు కూడా సులభంగా విజయవంతమవుతాయి. వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఊహించని భారీ లాభాలు కలగడమే కాకుండా ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు తొలగిపోయి.. పదోన్నతులు కూడా సులభంగా లభిస్తాయి.

వృశ్చిక రాశి
ఈ యోగం ప్రభావంతో వృశ్చిక రాశివారికి కూడా ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, యువత ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాలు వచ్చి ధన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మేలు జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES