• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /రాబోయే నెల రోజుల్లో ఈ 7 రాశుల వారికి అదృష్ట యోగం.. ఊహించని ధన లాభాలు!

రాబోయే నెల రోజుల్లో ఈ 7 రాశుల వారికి అదృష్ట యోగం.. ఊహించని ధన లాభాలు!

Graha Gochar 2026: ఈ నెలలో గ్రహ స్థానాలు చాలా ప్రత్యేకమైనవిగా పరిగణించ బడతాయి. ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. అవును గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం వలన కొన్ని రాశులకు వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నట్టు పండిత్ నాగరాజ్ శర్మ చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఈ రాశులకు వారికీ బంపర్ జాక్‌పాట్ తగలపోతున్నట్టు గ్రహ గోచారం చెబుతున్న మాట.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 05:05 AM IST|Updated: Oct 05, 2026, 05:05 AM IST
joinshare
రాబోయే నెల రోజుల్లో ఈ 7 రాశుల వారికి అదృష్ట యోగం.. ఊహించని ధన లాభాలు!
Image Credit: Horoscope (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సీనియర్ హీరోయిన్స్‌కు వరంగా మారిన స్పెషల్ సాంగ్స్..

సీనియర్ హీరోయిన్స్‌కు వరంగా మారిన స్పెషల్ సాంగ్స్..

2

చిరు, పవన్‌లతో సింగీతం సినిమాలు ఎందుకు ఆగిపోయాయి..? ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోవడం వెనుక అసలు నిజాలివే!

3

రాబోయే నెల రోజుల్లో ఈ 7 రాశుల వారికి అదృష్ట యోగం.. ఊహించని ధన లాభాలు!

4

Srishti Vyakaranam Elimination: బిగ్‌బాస్ హౌస్‌ నుంచి హాట్ బ్యూటీ సృష్టి ఎలిమినేషన్..నాలుగు వారాలకు ఎంత సంపాదించిందంటే?

5

Janhvi Kapoor Chuttamalle AI: జాన్వీకపూర్ వీడియో చేసిందెవరు? AI టెక్నాలజీ మనిషిలకే ప్రాణాతంకమా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

రాబోయే నెల రోజుల్లో ఈ రాశులకు గొప్ప ప్రయోజనాలు: ఈ యేడాది అక్టోబర్ నెల చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. అక్టోబర్‌లో గ్రహాల కదలిక అన్ని రాశులను ప్రభావితం చేస్తుందనే చెప్పాలి. అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈలోగా, అక్టోబర్ చివరి వరకు గురుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. అదే సమయంలో బుధుడు తులా రాశిలో సంచరించనున్నాడు.  శుక్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. అదే సమయంలో శనిదేవుడు మీనరాశిలో సంచరిస్తాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేసాడు.  చంద్రుడు 12 రాశులలోనూ ఈ నెలలో సంచరించబోతున్నాడు.ప్రస్తుతం, శుక్రుడు, బుధుడు తులారాశిలో లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. గురుడు హంస రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.

సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన వెంటనే, అది బుధుడితో సంయోగం చెంది బుధాదిత్య రాజయోగాన్ని సృష్టిస్తుంది. తత్ఫలితంగా, గ్రహ సంచారాలు, రాజయోగం యొక్క ఈ శుభ కలయిక కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది.

రాబోయే నెల రోజులలో ఏడు రాశుల వారికి  అద్భుత యోగాలు ఉండనున్నాయి.  సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురుడు, శనిశ్వరుడు, చంద్రుని సంచారాలు గణనీయమైన ప్రయోజనాలను తీసుకురాబోతున్నాయి.

సింహ రాశి..

సింహ రాశి వారికి అక్టోబర్ నెల కొత్తగా ఉండబోతుంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని అంచనా. విద్యార్ధులు, ఉద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి.

కన్యా రాశి..

అక్టోబర్ నెల కన్యారాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. వ్యాపారంలో కొత్త లాభాలు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొత్త ప్రయోగాలు ఫలప్రదం అవుతాయి.  కుటుంబంలో శాంతి వెల్లివిరుస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కలిసొచ్చే అవకాశాలున్నాయి.

తులా రాశి..

తులారాశి వారికి అక్టోబర్ నెలలో ఊహించని ధనలాభం అందుకోబోతున్నారు. ఇంట్లో, కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పోటీ పరీక్షలు రాసే ఉద్యోగార్ధులు శుభవార్తలు వింటారు. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు వివాహా యోగం సిద్ధించబోతున్నట్టు సమాచారం. ఖర్చుల విషయంలో అప్రమత్తత అవసరం.  

మకర రాశి..

మకరరాశి వారికి రాబోయే నెల రోజులు పండగ వాతావరణం నెలకుంటుంది. మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు కలిసొస్తాయి. సొంతింటి కల నెరవెరే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఊహించని ధనలాభం వీరి సొంతం కాబోతుంది.

మీన రాశి.. 
మీనరాశి వారికి అక్టోబర్ నెల కొత్త అవకాశాలను తీసుకురాబోతుంది. మీ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు.  స్నేహితుల మద్దతుతో పాటు, మీ ఉద్యోగంలో విజయం సాధించే అవకాశాలున్నాయి. మీ పై అధికారుల మెప్పు పొందుతారు. నిరుద్యోగులకు ఇది శుభ సమయం.

వృషభ రాశి..

వృషభ రాశి వారికి అక్టోబర్ నెల అనుకూలంగా ఉండబోతుంది.  అనుకున్న పనులు పూర్తవుతాయి. కొత్తగా  జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్త ఇంటి కల నెరవేరే అవకాశాలున్నాయి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల అద్భుతంగా ఉండబోతుంది. కొత్త పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండబోతుంది.  సొంతింటి కల నెరవేరే ఛాన్సెస్ ఉన్నాయి.  ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుంది. కొత్త వ్యాపార మార్గాలు ఏర్పడుతాయి.

Disclaimer (గమనిక):ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని జీ మీడియా న్యూస్ చెప్పడం లేదు. ఇవి ఆయా గ్రహాల సంచారంతో పాటు ఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇది మారుతు ఉంటుంది. ఇతర వివరాల కోసం.. జ్యోతిష్య పండితులు తంజావూర్ నాగరాజ శర్మ, ఈ మెయిల్‌ ID: tanarsharma@gmail.com, ఫోన్: 9395354502 సంప్రదించండి.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Daily Horoscope
Telugu Rasi Phalalu