• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అయ్యప్ప మండల దీక్షలో సబ్బు వాడవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..!

అయ్యప్ప మండల దీక్షలో సబ్బు వాడవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..!

Ayyappa Deeksha: కార్తీక మాసంలో హరి, హర సుతుడైన అయ్యప్ప స్వామిని ప్రత్యేకంగా పూజించడం హిందూ సనాతన సంప్రదాయంలో ఆనవాయితీ వస్తోంది. చాలా మంది భక్తులు కార్తీక మాసంలో అయ్యప్ప మండల దీక్షను స్వీకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి దర్శనంతో దీక్ష కాలం పూర్తవుతుంది. ఈ మండల దీక్ష కాలం 40 రోజుల్లో చాలా మంది అయ్యప్ప స్వాములు స్నానాది కార్యక్రమాలపుడు సబ్బు వాడవచ్చా అనే ఓ సందేహం ఉంటుంది. ఇంతకీ మండల దీక్షలో సబ్బును ఉపయోగించవచ్చా..? శాస్త్రం ఏం చెబుతుందంటే..?

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 08:42 AM IST|Updated: Nov 14, 2026, 08:45 AM IST
joinshare
అయ్యప్ప మండల దీక్షలో సబ్బు వాడవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..!
Image Credit: Ayyappa Deeksha (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అయ్యప్ప స్వామి దీక్షలో  నల్లవస్త్రాలనే  ఎందుకు ధరించాలి.. !!

అయ్యప్ప స్వామి దీక్షలో నల్లవస్త్రాలనే ఎందుకు ధరించాలి.. !!

2

అయ్యప్ప మండల దీక్షలో సబ్బు వాడవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..!

3

ఏపీ వైపు దూసుకొస్తోన్న తుపాను.. బిగ్ అలర్ట్..

4

Winter Health Tips for Kids: చలి వల్ల పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి!

5

భాగ్యనగరంలో నేడు రాహుల్ ర్యాలీ.. హై అలర్ట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ayyappa Deeksha: హరి, హరులకు సంబంధించిన పుత్రుడు కాబట్టి శ్రీవైష్ణవులు, స్మార్తులు, శైవులందరు అయ్యప్పను ఎంతో భక్తితో ఆరాధిస్తుంటారు.అయ్యప్ప అంటే అయ్య అంటే తండ్రి.. అప్ప అంటే తల్లి అని అర్ధం. హరి హర సుతుడునే అర్ధంలో అయ్యప్పగా లోక ప్రసిద్ధి చెందాడు. అయితే అయ్యప్ప దీక్ష తీసుకునే  భక్తులలో చాలామందికి స్నానం చేసే సమయంలో ఓ సందేహం వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది.  అయ్యప్ప దీక్షలో సబ్బు వాడవచ్చా ? శాస్త్రం ఏం చెబుతుంటే..

అయ్యప్ప దీక్ష స్వభావం విషయానికొస్తే.. 

ఈ దీక్ష అనేది సన్యాసం కాదు. బ్రహ్మచర్య వ్రతం మాత్రమే. అయ్యప్ప స్వామి దీక్ష సన్యాస దశ కాదు. అది గృహస్థులు కూడా చేయగలిగే ఒక పరమ పవిత్ర వ్రతం. దీక్షలో మనం బ్రహ్మచర్యం, శౌచం, శ్రద్ధ, నియమంతో ఎలా జీవించాలనేది చెబుతుంది. ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. పవిత్రతతో, ఆత్మ నియమంతో ఉండటమే అయ్యప్ప దీక్ష ముఖ్య ఉద్దేశ్యం.  

అయ్యప్ప దీక్ష అనేది భౌతిక  ప్రపంచాన్ని త్యాగం చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. 

దీక్ష అనేది దైవ స్మరణతో జీవితం నడిపించే సాధన కాలంగా పరిగణించాలి. శౌచం అంటే శుభ్రత — శరీరం కూడా ఓ దేవాలయం వంటిది. అందుకే అయ్యప్ప దీక్షలో శరీర శౌచానికి కూడా ముఖ్యమైన భాగం.ఈ దీక్షా సమయంలో సబ్బు లేదా దానికి సంబంధించిన ఉత్పత్తులను వాడవచ్చా అనే సందేహం భక్తుల్లో కలగడం సహజం.

అయ్యప్ప దీక్షా సమయంలో సాధ్యమైనంత సాత్వికంగా రసాయన రహితంగా, సుగంధ ఆకర్షణ లేని  సౌందర్య ఉత్పత్తులను ఎంచక్కా వాడొచ్చు. దీక్షలో ఉన్న స్వాములు సబ్బు వాడటంలో ఎలాంటి తప్పు లేదు కానీ అది విలాసం కోసం కాదు. శుద్ధి కోసం ముఖ్యంగా  శరీర శౌచం కోసం మాత్రమే వాడాలి.

ఏ దీక్షలోనైనా  ప్రధాన ఉద్దేశ్యం — 

అంత:కరణ శుద్ధి అనేది ముఖ్యమైనది. మనకు అయ్యప్ప స్వామి దీక్ష చెప్పేది  బాహ్య స్వచ్ఛత కన్నా అంత:కరణ స్వచ్ఛత అనేది చాలా ముఖ్యమైనదిగా చెబుతుంది.

కాబట్టి సబ్బు వాడటం కన్నా మన మనస్సు, వాక్కు, ఆచరణ పవిత్రంగా ఉండటమే ముఖ్యమని  అయ్యప్ప దీక్షసూచిస్తుంది. దీక్లలో సబ్బు వాడవచ్చు కానీ అది  సాధారణమైన సాత్వికమైనది మాత్రమే వాడాలి. సుగంధం, రసాయనాలు, సౌందర్య సబ్బులు దూరంగా ఉండండి. దీక్షలో ప్రధానమైనది — శుద్ధమైన మనసుతో  అయ్యప్ప స్వామిని ఆరాధించడమే ఈ దీక్షలో  ప్రధానమైనది.

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Astrological Remedies
Telugu Rasi Phalalu