• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /Winter Health Tips for Kids: చలి వల్ల పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి!

Winter Health Tips for Kids: చలి వల్ల పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి!

Winter Health: నవంబర్ నెల వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పులు మొదలవుతాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతూ, ఉదయం వేళల్లో చలి, పొగమంచు ఎక్కువగా కనిపిస్తాయి. అదే సమయంలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. చల్లని వాతావరణానికి కాలుష్యం తోడవడంతో ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే వర్షాకాలం నుంచి శీతాకాలానికి మారుతున్న సమయంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు పిల్లలను ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యం ఈ సమస్యలను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్‌లో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Written ByVishnu Priya
Published: Nov 14, 2026, 07:50 AM IST|Updated: Nov 14, 2026, 07:50 AM IST
joinshare
Winter Health Tips for Kids: చలి వల్ల పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అయ్యప్ప స్వామి దీక్షలో  నల్లవస్త్రాలనే  ఎందుకు ధరించాలి.. !!

అయ్యప్ప స్వామి దీక్షలో నల్లవస్త్రాలనే ఎందుకు ధరించాలి.. !!

2

అయ్యప్ప మండల దీక్షలో సబ్బు వాడవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..!

3

ఏపీ వైపు దూసుకొస్తోన్న తుపాను.. బిగ్ అలర్ట్..

4

Winter Health Tips for Kids: చలి వల్ల పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి!

5

భాగ్యనగరంలో నేడు రాహుల్ ర్యాలీ.. హై అలర్ట్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Winter Health Tips for Kids: పెద్దవారితో పోలిస్తే చిన్నారుల ఊపిరితిత్తులు ఇంకా అభివృద్ధి చెందే దశలో ఉంటాయి. వారి రోగనిరోధక శక్తి కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో కలుషిత గాలి ప్రభావం త్వరగా పడుతుంది. ముఖ్యంగా గాలిలో ఉండే పీఎం 2.5, పీఎం 10 వంటి సూక్ష్మ కాలుష్య కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి చేరి శ్వాసనాళాల్లో చికాకును కలిగిస్తాయి. దీనివల్ల దగ్గు, జలుబు, గొంతు ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావచ్చు. ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలు ఉన్న పిల్లలకు చలి, కాలుష్యం మరింత ఇబ్బందిని కలిగిస్తాయి.

చలికాలంలో పిల్లలు ఎక్కువ సమయం ఇళ్లలో, పాఠశాలల్లో గడుపుతుంటారు. దీంతో ఒకరి నుంచి మరొకరికి వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. కాలుష్యం వల్ల శ్వాసనాళాలు సున్నితంగా మారినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు. అందుకే పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు.

ముఖ్యంగా రోజుల తరబడి తగ్గని దగ్గు, తరచూ జలుబు, శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలు రావడం, వేగంగా ఊపిరి పీల్చడం, ఛాతీలో అసౌకర్యం, సాధారణం కంటే ఎక్కువ అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. చిన్నారికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారినా, శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీ లోపలికి లాగుతున్నట్లు కనిపించినా, పెదవులు నీలం రంగులోకి మారినా వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించాలి.

పిల్లల ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రతిరోజూ స్థానిక గాలి నాణ్యత సూచీ (AQI) వివరాలను గమనించాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో పిల్లలను బయట ఎక్కువసేపు ఆడుకోనివ్వకూడదు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో ఆరుబయట ఆటలకు దూరంగా ఉంచడం మంచిది. అవసరమైనప్పుడు ఇంట్లోనే ఆటలు, వ్యాయామాలు చేసుకునేలా చూడాలి.

ఇంట్లో కూడా స్వచ్ఛమైన గాలి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల కాయిల్స్, అగరబత్తులు, సిగరెట్ పొగ వంటివి పిల్లలకు దూరంగా ఉంచాలి. బయట కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు మూసి ఉంచాలి. అయితే గాలి నాణ్యత మెరుగ్గా ఉన్నప్పుడు ఇంట్లో సరైన గాలి ప్రసరణ ఉండేలా చూడాలి.

పిల్లలకు తరచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. తగినంత నీరు తాగించడం, పోషకాహారం అందించడం కూడా ముఖ్యం. ఆస్తమా ఉన్న చిన్నారులకు వైద్యులు సూచించిన మందులు, ఇన్‌హేలర్లు అందుబాటులో ఉంచాలి. ఫ్లూ వ్యాక్సిన్ సహా అవసరమైన టీకాల గురించి వైద్యులను సంప్రదించాలి.

మరోవైపు తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సీజనల్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.

చలికాలంలో వచ్చే ప్రతి దగ్గు కాలుష్యం వల్లే వస్తుందని భావించకూడదు. అదే సమయంలో లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగినా, తీవ్రత పెరిగినా నిర్లక్ష్యం చేయకూడదు. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైనప్పుడు వైద్య సహాయం పొందడం ద్వారా పిల్లల శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Also Read: 

 

మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

 

అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News