• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /డిసెంబర్‌లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్థిక కష్టాలకు చెక్!

డిసెంబర్‌లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్థిక కష్టాలకు చెక్!

Budhaditya Raj Yoga Effect: వృశ్చిక రాశిలో సూర్య, బుధుల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 25, 2026, 09:59 IST|Updated: Nov 25, 2026, 10:00 IST
joinshare
డిసెంబర్‌లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్థిక కష్టాలకు చెక్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

2

Delhi: ఢిల్లీలో షాకింగ్ ఘటన..కేఫ్‌లో యువతిపై సాముహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్..

3

డిసెంబర్‌లో ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు!

4

రెగ్యులర్ కథలకు నో చెబుతున్న మిడ్ రేంజ్ కథానాయికలు.. ఢిఫరెంట్ స్టోరీలతో ఇమేజ్ మేకోవర్..

5

డిసెంబర్‌లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్థిక కష్టాలకు చెక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Budhaditya Raj Yoga Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల గమనంలో జరిగే మార్పులు మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు.. ముఖ్యంగా డిసెంబర్ నెల ప్రారంభంలోనే ఒక అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది.. గత నవంబర్ 16న గ్రహాలకు రాజైన సూర్యుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేయగా.. డిసెంబర్ 2వ తేదీన తెలివితేటలు, వ్యాపారాలకు కారకుడైన బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.. వృశ్చిక రాశిలో సూర్య, బుధ గ్రహాల కలయిక కారణంగానే ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే, ఈ యోగంతో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో? అద్భుతమైన లాభాలు సొంతం చేసుకునే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మీన రాశి:
బుధాదిత్య రాజయోగం ఎఫెక్ట్‌తో మీన రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా దాని నుంచి సులభంగా బయటపడే అవకాశాలు కూడా సులభంగా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆర్థికంగా అద్భుతమైన మార్పులు కూడా చోటు చేసుకునే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. పాత అప్పులు సులభంగా తిరిపోతాయి.. ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

మేష రాశి:
బుధాదిత్య రాజయోగం ప్రభావంతో మేష రాశి వారికి ఒక వరంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎంతోకాలంగా వేధిస్తున్న వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలకు కూడా సులభంగా పరిష్కారం లభించే ఛాన్స్‌లు ఉన్నాయి.. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభించి.. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కూడా సులభంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు భారీ మొత్తంలో లాభాలు కూడా సులభంగా కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే ఎంతో బలోపేతం అవుతుంది.. ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ శుభ సమయాన్ని వినియోగించుకోవడం చాలా మంచిది..

కన్యా రాశి:
ఈ శక్తివంతమైన రాజయోగంతో కన్యా రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి లేదా మార్పు కోరుకునే వారికి భారీ ప్యాకేజీతో కూడిన బంపర్‌ ఆఫర్లు కూడా సులభంగా లభించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా, ఉన్నత చదువులు లేదా ఉద్యోగ కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.. మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా విపరీతంగా పెరుగుతుంది..

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి డిసెంబర్ ప్రారంభం నుంచే అద్బుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. ఆర్థిక సమస్యలు కడా సులభంగా తొలగిపోతాయి.. కొత్త ఆదాయ మార్గాలు కూడా రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులతో పాటు జీతాల పెరుగుదల వంటి శుభవార్తలు కూడా సులభంగా వింటారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దాంపత్య, ప్రేమ జీవితాల్లో సంతోషం మరింత పెరుగుతుంది.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Rashi Phalalu