SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చాణక్య నీతి: ఇలాంటి భార్య పక్కలో బల్లెం లాంటిది.. ఇంట్లోనే శత్రువుతో సమానం..!

Chanakya Niti for Wife Behaviour: చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు సదా ఆచరణీయం అని చెప్పాలి. ఇక చాణక్యుడు భార్య గురించి పలు అంశాలను ప్రస్తావించారు. అందులో భార్య రూపవతి శత్రువు అని చాణుక్యుడు చెప్పిన నీతి సూత్రం. భార్య యొక్క అతి సౌందర్యం భర్తకు అతిపెద్ద ప్రమాదం అని చెప్పారు. వీళ్ల వలన భర్తలకు ఎలాంటి ప్రమాదం సంభవించబోతుందో అప్పట్లోనే చెప్పారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 05, 2026, 05:50 AM IST | Updated: Nov 05, 2026, 05:51 AM IST
Image Credit: Chanakya Niti (Source/AI)
Join

Chanakya Niti for Glamourous Wife:  భార్యాభర్తల సంబంధం: చాలా మంది పురుషులు తమకు అందమైన గ్లామరస్  భార్య కావాలని కోరుకుంటారు. కానీ ఆచార్య చాణక్య అందమైన స్త్రీని పెళ్లి  చేసుకోవడం వలన పలు ఇబ్బందులు పడతారని తన చాణక్య నీతి శాస్త్రంలో సవివరంగా చెప్పుకొచ్చారు.

చాలా మంది పురుషులు అందమైన భార్యను ఉండాలని కోరుకుంటారు. అది పురుషుల సహజ లక్షణం. కానీ అలాంటి భార్య భర్తకు సమస్య అని ఆచార్య చాణక్యుడు అప్పట్లోనే తన చాణక్యనీతిలో  చెప్పిన మాట.  

ఆచార్య చాణక్య ప్రకారం.. భార్య అందం ఆమె భర్తకు సమస్య కావచ్చని తన నీతి శాస్త్ర గ్రంథంలో ప్రస్తావించారు.  అవును, అందమైన భార్య భర్తకు కొంత మంది శత్రువులను తీసుకురావొచ్చని  చాణక్యుడు చెప్పిన మాట.

ముఖ్యంగా భర్త బలహీనుడైనపుడు భార్య అందంగా ఉంటే, ఆమె అతని పలు సమస్యలను కారణం అయ్యే అవకాశాలే  ఎక్కువగా ఉన్నాయని చాణక్య నీతి చెబుతోంది.

భార్య అందమైనదే కావొచ్చు. కానీ ఆమె తన మొగుడిని  గౌరవించడం లేదా ప్రేమించకపోతే, అది భర్తకు  సమస్యగా మారవచ్చు. ఎందుకంటే ప్రేమ, గౌరవం లేని సంబంధం శాశ్వతంగా నిలబడదనేది చాణక్యుడు చెప్పిన మాట.  

దీనితో పాటు.. ఇద్దరి మధ్య ఒకరినొకరు గౌరవించుకోవాలని చాణక్యుడు చెబుతున్న నీతి శాస్త్రం. అది లేకపోత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయని చెప్పుకొచ్చారు.  చివరికి వారి అనుబంధం పేక మేడలా కూలిపోతుందని  చాణక్యుడు చెప్పిన మాట.

గమనిక (Disclaimer): పై సమాచారం చాణక్యుడు చెప్పిన నీతి శాస్త్రం చెప్పిన విషయాలనే మేము ఇక్కడ ప్రస్తావించాము. జీ  న్యూస్ ఈ వార్తను ధృవీకరించడం లేదు. దీనిని స్వీకరించే ముందు ఒకటికి రెండు సార్లు  దీనికి సంబంధించిన అంశాలకు సంబంధించిన నిపుణులను సంప్రదిస్తే బెటర్. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES