• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శ్రీరాముడి పాత్రలో నటించిన హీరోలు.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శ్రీరాముడి పాత్రలో నటించిన హీరోలు.

Sri Rama Navami 2026: మన దేశ సంస్కృతి సంప్రదాయాలన్ని రామాయణ ఇతిహాసంతో ముడిపడి ఉన్నాయి. రాముని అవతారం ఎంతో ఉన్నతమైనది. ఆ అవతారంలో ఎన్నో విలువున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఇవి ఆచరణయమే. తెలుగు వారికి శ్రీరాముడికి విడదీయరాని ఇక తెలుగు వారికి శ్రీరాముడు అంటే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. కానీ తెలుగులో తొలిసారి శ్రీరాముడి పాత్రలో నటించిన నటుడు ఎవరో తెలుసా.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 05, 2026, 05:15 AM IST|Updated: Nov 05, 2026, 05:16 AM IST
joinshare
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శ్రీరాముడి పాత్రలో  నటించిన హీరోలు.
Image Credit: Rama Charecters (Source/Movie Pics)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
చాణక్య నీతి: ఇలాంటి భార్య పక్కలో బల్లెం లాంటిది..  ఇంట్లోనే శత్రువుతో సమానం..!

చాణక్య నీతి: ఇలాంటి భార్య పక్కలో బల్లెం లాంటిది.. ఇంట్లోనే శత్రువుతో సమానం..!

2

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శ్రీరాముడి పాత్రలో నటించిన హీరోలు.

3

Bethupally Cheruvu: ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతు.. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి అలర్ట్‌

4

SDRF Boats Washed Away: ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతు.. చెరువు వరదలో కొట్టుకుపోయిన 13 మంది

5

DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

First hero Who Played Sri Rama Character: శ్రీరాముడంటే  మానవీయ విలువలు. మరెన్నో సంస్కృతి సంప్రదాయాలు..కుటుంబ వ్యవస్థలోని బంధాలు,  అనుబంధాలు గుర్తకు వస్తాయి. ఓ భర్తగా,  స్నేహుతునిగా, కుమారుడిగా,  అన్నగా, పాలకుడిగా రాముడి గురించి ఎంత చెప్పిన తక్కువే.  ఇక తెలుగులో అసలు తెలుగు సిన్మా పౌరాణికాలతో ప్రారంభం అయింది. మన దగ్గర తెలుగుల రాముని కథతో  వచ్చిన ఫస్ట్ మూవీ ‘శ్రీరామపాదుకా పట్టాభిషేకం’. 1932లో మూకీలు ప్రారంభమైన తర్వాత విడుదలైన ఈ  చిత్రంలో యడవల్లి సూర్యనారాయణ ఫస్ట్ టైమ్ రాముని పాత్రలో కనువిందు చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు సహా.. ప్రభాస్.. తాజాగా హిందీలో రణ్‌బీర్ కపూర్.. ఇక రాబోయే వారణాసిలో మహేష్ బాబు శ్రీ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగులో రాముడి వేషంలో మెప్పించిన హీరోల విషయానికొస్తే..


రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor): చాలా కాలం తర్వాత హిందీలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఈ  చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటించారు. యశ్ రావణుడిగా నటించారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తొలి భాగం నేడు విడుదలైంది. రెండో భాగం వచ్చే యేడాది దీపావళి కానుకగా విడుదల కానుంది.

మహేష్ బాబు (Mahesh Babu as Sri Rama in Varanasi): తెలుగు సిల్వర్ స్క్రీన్ పై  శ్రీరామడిపై వచ్చిన చిత్రాలు మరో భాషలో తెరకెక్కలేదు. త్వరలో  మహేష్ బాబు ..‘వారణాసి’ చిత్రంలో శ్రీ రాముడిగా  కనిపించనున్నాడు. వచ్చే యేడాది ఏప్రిల్ 7న ఈ  సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో నీలమేఘశ్యాముడిగా నటించలేదు.

ప్రభాస్ (Prabhas): రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్'.ఈ  చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ టైమ్   శ్రీరాముడి పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో నీల మేఘ శ్యాముడిగా కాకుండా సాధారణంగా కనిపించాడు. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది.  

నందమూరి బాలకృష్ణ ( Balakrishna): బాపు డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’. అంతకు ముందు కొన్ని సినిమాల్లో కేవలం పాటల్లోశ్రీ రాముడి పాత్రల్లో కనిపించాడు.  

సుమన్ (Suman): తెలుగు సీనియర్ కథానాయకుడు భద్రాచలం రామ మందిరం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీరామదాసు'. ఈ చిత్రంలో  శ్రీరాముడి క్యారెక్టర్ లో  మెప్పించారు.  

శ్రీకాంత్ (Srikanth): కోడిరామకృష్ణ డైరెక్షన్ లో   తెరకెక్కిన చిత్రం 'దేవుళ్లు'. ఈ చిత్రంలో ఓ పాటలో  శ్రీకాంత్  శ్రీరాముడి క్యారెక్టర్ లో కాసేపు కనిపించాడు.  

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR): నందమూరి మూడో తరం వారసుడు  జూనియర్  ఎన్టీఆర్ తన జీవితాన్ని రాముడి పాత్రతో మొదలు పెట్టాడు.   అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ‘రామాయణం’ చిత్రంలో నీలమేఘ శ్యాముడిగా నటించి మెప్పించడం విశేషం.

శోభన్ బాబు (Shobhan Babu):  నట భూషణ శోభన్ బాబు హీరోగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సంపూర్ణ రామాయణం'. ఈ చిత్రంలో శోభన్ బాబు రామయ్య తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. ఆ తర్వాత ‘దేవాలయం’ సినిమాలో ఓ పాటలో కనిపించారు.  

NTR (ఎన్టీఆర్) : తెలుగు ప్రేక్షకులకు శ్రీరామచంద్రుడు అంటే నందమూరి తారక రామారావే అని చెప్పాలి. తెలుగు సిల్వర్ స్క్రీన్ పై  రాముడి పాత్రలో జీవించి సార్ధక నామ ధేయుడిగా నిలిచారు అన్నగారు.  ఒకప్పటి 'సంపూర్ణ రామాయణం' నుంచి ‘శ్రీరామ పట్టాభిషేకం’ వరకు చాలా చిత్రాల్లో  శ్రీరాముడి  పాత్రల్లో నటించిన రికార్డు ఎన్టీఆర్ సొంతం.  

తెలుగు రాముళ్లు (Telugu Ramas)..

అటు తెలుగు తెరపై అలనాటి హీరోలు  ఏఎన్నాఆర్, కాంతారావు, హరనాథ్, రవి సహా పలువురు హీరోలు కూడా శ్రీరామ చంద్రుడి పాత్రలో  పాత్రల్లో నటించి మెప్పించడం విశేషం.

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie