• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Bethupally Cheruvu: ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతు.. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి అలర్ట్‌

Bethupally Cheruvu: ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతు.. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి అలర్ట్‌

Telangana CM And Deputy CM High Alert On SDRF Boats Washed Away Incident: భారీ వర్షాలతో చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతు కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అప్రమత్తమయ్యారు. సంఘటనపై వివరాలు ఆరా తీయడమే కాకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 04, 2026, 10:48 PM IST|Updated: Nov 04, 2026, 10:52 PM IST
joinshare
Bethupally Cheruvu: ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతు.. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి అలర్ట్‌
Image Credit: Khammam SDRF Boats Incident

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Bethupally Cheruvu: ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతు.. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి అలర్ట్‌

Bethupally Cheruvu: ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతు.. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి అలర్ట్‌

2

SDRF Boats Washed Away: ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతు.. చెరువు వరదలో కొట్టుకుపోయిన 13 మంది

3

DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!

4

EC Notification: ఏపీలో డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

5

Marriage Course: పెళ్లికి కూడా ఈ రాష్ట్రంలో స్పెషల్ కోర్సు.. ఆ విషయాల్లో ప్రత్యేక క్లాసులు.. అసలు విషయం ఇదే..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

SDRF Boats Washed Away: మురసు తుఫాను ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకస్మిక వరదతో చెరువు అలుగు పారడంతో అందులో మత్య్సకారులు చిక్కుకోగా.. వారిని కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్ఎఫ్‌ బోట్లు గల్లంతయ్యాయి. ఆ బోట్లలో ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 13 మంది ఉన్నట్లు తెలియడంతో తీవ్ర సంచలనం రేపింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వరదలో కొట్టుకుపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్పందించి స్థానిక అధికార యంత్రాంగానికి సహాయ చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ముఖ్యమంత్రి ఆదేశాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

డిప్యూటీ సీఎం ఆరా
సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించి సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చారు. అధికార యంత్రాంగానికి వీలైనంత సహాయ చర్యలు చేపట్టాలని భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు.

రంగంలోకి బండి సంజయ్‌
ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వరదలో గల్లంతు కావడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ వెంటనే రంగంలోకి దిగారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎస్డీఆర్ఎఫ్ బోట్ల గల్లంతుపై కలెక్టర్ దివాకర్‌తో ఫోన్‌లో మాట్లాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరాలు తెలుసుకున్నారు. చెరువులో కొట్టుకుపోయిన ఎస్డీఆర్ఎఫ్ బోట్ల ఆచూకీ కనిపెట్టాలని ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులను కోరారు. దీంతో యుద్ద ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది.

పొంగులేటి సమీక్ష
బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతు ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతైన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వెంటనే రంగంలోకి దిగారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైన అన్ని రకాల రక్షణ పరికరాలు, బోట్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆచూకీ తెలుసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, సహాయక చర్యల పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నామని మంత్రి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు రేపు ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని క్షేమంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Rain News
Telugu News
Trending News