SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఈ 3 రాశులకు భారీ ధనలాభాలు.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు!

Diwali 2026 Astrology: దీపావళి పండగ సీజన్లు కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు కదలికలు చేయడంతో ఏర్పడే ప్రభావం అనేక రాశుల జీవితాల్లో మార్పులను తీసుకువస్తుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజ్ శర్మ తెలిపారు. ముఖ్యంగా అక్టోబర్ నెల నుంచి జరిగే కొన్ని గ్రహసంచారాలు వల్ల కొన్ని రాశుల వారికి నవంబర్ నెలలో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 20, 2026, 10:46 AM IST | Updated: Sep 20, 2026, 10:48 AM IST
Image Credit: ఈ 3 రాశులకు భారీ ధనలాభాలు.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు!
Join

Diwali 2026 Astrology In Telugu: ఈ సంవత్సరం దీపావళి పండగ నవంబర్ 8వ తేదీ ఆదివారం రోజు వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం పరంగా నవంబర్ కంటే ముందు వచ్చే నెల అక్టోబర్ చాలా ముఖ్యమైంది గా భావించవచ్చని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. ఈ సమయంలో అనేక గ్రహగమనాల మార్పులు ఉంటాయని.. ముఖ్యంగా సూర్యుడితో పాటు బుధుడు గురుడు శుక్రుడు శని, రాహువు కేతువులు ఈ సమయంలో గ్రహస్థానాల్లో మార్పులు చేస్తాయని.. దీంతో నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ధనంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలపరంగా ఊహించని సంపద లభిస్తుందని.. వృత్తి జీవితంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆయన వెల్లడించారు.. ముఖ్యంగా కొన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు చేకూరుతాయని అన్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ నెల నుంచి నవంబర్ నెల మధ్యలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో తెలుసుకోండి..

ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనాలు..
వృషభ రాశి 
వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడంతో.. వీరికి అక్టోబర్ నెల నుంచి నవంబర్ మధ్య నెల వరకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని.. భౌతిక సుఖంతో పాటు ఆస్తులపరంగా విశేషమైన లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా వీరి ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగడమే కాకుండా.. కొత్త పనుల్లో విశేషమైన ప్రయోజనాలను సొంతం చేసుకుంటారని, ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారాల విస్తరణ చాలా వరకు జరుగుతుందన్నారు. ముఖ్యంగా అవసరమైన విషయాలపై శ్రద్ధ ఉంచుకొని జీవితంలో ముందుకు వెళ్లడం వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరడమే కాకుండా ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయన్నారు. అలాగే ఈ సమయంలో పెట్టుబడును పెట్టే వారికి చాలా లాభదాయకంగా ఉంటుందన్నారు.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సొంత రాశిలోనే అక్టోబర్ 31వ తేదీన గురు గ్రహం ప్రవేశిస్తుందని.. ముఖ్యంగా నవంబర్ నెల మధ్య నాటికి వీరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని.. దీపావళి సమయంలో అద్భుతమైన ధన లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగంలో కొత్త బాధ్యతను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న అవకాశాలు కూడా సులభంగా లభిస్తాయని.. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలను కూడా సొంతం చేసుకుంటారన్నారు. అలాగే ఆర్థిక విషయాల్లో తప్పకుండా అద్భుతమైన మెరుగుదల ఉంటుందని.. ముఖ్యంగా ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

కన్య రాశి 
కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కావడంతో అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నెల మధ్యనాటి గ్రహగమనాల్లో ఏర్పడే ప్రభావంతో వీరికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయని.. ముఖ్యంగా తెలివితేటలు విపరీతంగా పెరుగుతాయని నాగరాజ్ శర్మ తెలిపారు. పాత పరిచయాలనుంచి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా సొంతం చేసుకుంటారన్నారు. ముఖ్యంగా ఏవైనా కొత్త ప్రణాళికలు వేస్తే.. ఖర్చులను కూడా చూసుకొని ముందుకెళ్లడం చాలా మంచిదన్నారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం.. ముఖ్యంగా అధికంగా డబ్బులు ఖర్చు చేయకపోవడం మంచిదని అని సూచించారు. అలాగే సరైన మార్గాల్లో వెళ్లి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ఆయన తెలిపారు..
 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES