దీపావళి పండుగతో ఈ రాశుల వారికి జాక్‌పాట్.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!
Diwali 2026 Horoscope: దీపావళి పండగ రోజున ఈ కింది రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ పండగ రోజున అనేక గ్రహాలు మార్పులు చేర్పులు చేయబోతున్నాయి. దీంతో ఈ కింది రాశులవారికి ఈ సమయం అద్బుతంగా ఉంటుంది..
Diwali 2026 Horoscope Telugu News: ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 8వ తేది వచ్చింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున దీపావళిని జరుపుకుంటారు.. ఈ రోజు ప్రతి హిందువు లక్ష్మదేవితో పాటు వినాయకుడిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా దీపావళి రోజున ఆ లక్ష్మీదేవి అమ్మవారు భూమిపైకి వచ్చి.. భక్తుల కోరికలు తీర్చుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపాలు వెలిగించి.. లక్ష్మీదేవతకు స్వాగతం పలుకుతూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.
ఈ దీపావళి జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. శుక్రుడు, గురుడితో పాటు శనితో సహా అనేక గ్రహాలు నవంబర్‌లోని ఇదే రోజున మార్పులు చేర్పులు చేయబోతున్నాయి.. ఈ మార్పు 12 రాశుల వారిపై చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. ముఖ్యంగా ఈ సమయంలో 5 రాశుల వారికి దీపావళి ప్రత్యేకంగా శుభప్రదంగా ఉందబోతోందని.. వీరికి బంపర్ లాభాలు కలుగుతాయని, ఆర్థికంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు..
వృషభ రాశి:
ఈ దీపావళి వృషభ రాశివారికి అనేక రకాల అద్భుతమైన శుభవార్తలను అందిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పై అధికారుల నుంచి అద్భుతమైన సపోర్ట్ కూడా పొందే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో భారీ లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అనేక రకాల కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.
సింహ రాశి:
సింహ రాశి వారికి దీపావళి చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి గురు గ్రహం ప్రభావంతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.. ముఖ్యంగా వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. పనిల్లో ఊహించని స్థాయిలో హోదాతో పాటు ప్రతిష్ట పెరిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి కూడా అనేక రకాల లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. కుటుంబంలో తప్పకుండా శుభకార్యాలు కూడా వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి దీపావళి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పనిలో కొత్త బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి. వ్యాపార అవకాశాలు కూడా కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా అద్భుతమైన సపోర్ట్ పొంది.. ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి దీపావళి శుభప్రదంగా ఉండబోతోందని.. ఈ సమయంలో వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి శుభవార్తలు కూడా సులభంగా లభిస్తాయి. వ్యాపారాల పరంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో అద్భుతమైన ఆనందం కూడా లభిస్తుంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే అవకాశాలు లబిస్తున్నాయి.
NOTE: