• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /కార్తీక మాసంలో ఏ రోజున ఎలాంటి పూజలు నిర్వహించాలి.. ఆచరించాల్సిన నియమాలు ఇవే..

కార్తీక మాసంలో ఏ రోజున ఎలాంటి పూజలు నిర్వహించాలి.. ఆచరించాల్సిన నియమాలు ఇవే..

Karthika Masam 2026: హిందూ సనాతన సంప్రదాయ కాలండర్ ప్రకారం కార్తీకం ఎనిమిదోది. దక్షిణాయంలో వస్తోంది. ఇది శివకేశవులకు అత్యంత ఇష్టమైన మాసం. అంతేకాదు ఏ నెలలో లేనట్టుగా ఈ మాసం మొత్తం దీపారాధన చేయాలనేది శాస్త్రం చెబుతున్న మాట. ఇంతకీ ఈ మాసంలో ఏ రోజున ఎలాంటి పూజలు నిర్వహించాలి. దీపారాధన వలన కలిగే లాభాలేమిటంటే..

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 02, 2026, 05:24 AM IST|Updated: Nov 02, 2026, 05:25 AM IST
joinshare
కార్తీక మాసంలో ఏ రోజున ఎలాంటి పూజలు నిర్వహించాలి.. ఆచరించాల్సిన నియమాలు ఇవే..
Image Credit: Karthika Masam Special (AI Generated Pic/ Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దర్శకులకు బాలయ్య బంపర్ ఆఫర్.. ఇది కదా కావాల్సింది.. !!

దర్శకులకు బాలయ్య బంపర్ ఆఫర్.. ఇది కదా కావాల్సింది.. !!

2

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వణికిస్తోన్న తుపాను.. భయం భయంగా హీరోలు, నిర్మాతలు..

3

కార్తీక మాసంలో ఏ రోజున ఎలాంటి పూజలు నిర్వహించాలి.. ఆచరించాల్సిన నియమాలు ఇవే..

4

Raptadu Police Fire: రాప్తాడు రాక్షసుడిపై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్ల కాల్పుల్లో హేమంత్‌కు గాయాలు

5

Rythu Garjana: రేవంత్‌ రెడ్డి పాలనలో నీళ్లు, కరెంట్, పథకాలు బంద్: కేటీఆర్‌

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Karthika Masam Pooja: కార్తీక మాసం శివకేశలకు ముఖ్యమైన మాసం. ఈ నెలలో చేసే శివాభిషేకంతో పాటు విష్ణు పూజలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.  కార్తీక మాసం ఈ నెల నవంబర్ 10వ తేది భౌమ వాసరే (మంగళ వారం) రోజున ప్రారంభమైంది. అంతేకాదు వచ్చే నెల డిసెంబర్ 8వ తేదిన  కార్తీక బహుళ అమావాస్య రోజున (భౌమ వాసరే )మంగళ వారం రోజున పోలి స్వర్గంతో కార్తీక మాసం ముగుస్తుంది. నవంబర్ 10వ తేదిన బలి పాడ్యమి..గోవర్ధన పూజ కార్తిక వ్రతం ఆరంభం అవుతుంది.

బలి పాడ్యమి రోజున విష్ణుమూర్తి వామనుడిగా బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అధిపతి చేసిన  తర్వాత, యేడాదికి  ఒకసారి భూలోక సంచారం చేసేందుకు  వరం ఇచ్చాడట. గోవర్ధన పూజ ద్వారా శ్రీకృష్ణుని ఆరాధించడం ఆనవాయితీ వస్తోంది. నవంబర్ 11న  యమ విదియ రోజున భగిన హస్త భోజనం.. దీన్నే ఉత్తరాదిన భాయ్ దూజ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. యమ ద్వితీయ రోజున యముడు తన సోదరి యమునా దేవి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తిన్నాడని పురాణ కథనాలు పేర్కొంటున్నాయి. సోదరులు తమ సోదరి ఇంట్లో భోజనం చేస్తే యమగండం (యమ భయం) తొలగుతుందని సనాతన సంప్రదాయంలో ఉంది. అందుకే ఈ రోజున సోదరి వంట చేతి భోజనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది.  

నవంబర్ 13  నాగుల చవితి నాగ దేవతలను పూజించే అతి ముఖ్యమైన పండుగ. పుట్టలో పాలు పోసి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన  సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం.  సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట. నవంబర్ 16, 23, 30లతో పాటు డిసెంబర్ 7వ తేదిల్లో అత్యంత శుభప్రదమైన  కార్తీక సోమవారాలున్నాయి. నవంబర్ 13న నాగుల చవితి.. నవంబర్ 16న అరుదుగా శ్రవణ నక్షత్రం రోజున వచ్చే కోటి సోమవారంగా  విశేషమైన పర్వదినంగా జరుపుకుంటారు.  

నవంబర్ 20న కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉప వాసం ఉండటం మూలానా.. ధనలక్ష్మి అనుగ్రహంతో  గ్రహదోషాలు పూర్తిగా తొలిగిపోతాయనేది శాస్త్ర వచనం. ఈ రోజున ఇంట్లో ఉసిరి, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. దీనినే ప్రబోధినీ ఏకాదశి గా పిలుస్తారు. దీనినే చిలుక ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర (చాతుర్మాస్య వ్రతం) ముగించుకొని మేల్కొనే రోజు. ఈ రోజు ఉపవాసం, విష్ణు ఆరాధన మోక్షదాయకం. ఈ రోజు నుండే శుభకార్యాలు మొదలవుతాయి.

నవంబర్ 22న  క్షీరాబ్ది ద్వాదశి / తులసీ వివాహం పాలు, పెరుగుతో చేసిన వంటకాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఈ రోజునే శ్రీకృష్ణునికి తులసి మొక్కకు వివాహం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు తులసి కోట వద్ద దీపారాధన చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని ప్రతీతి.

నవంబర్ 24న కార్తీక పౌర్ణమి మంగళ వారం రోజున జ్వాలా తోరణం నిర్వహిస్తారు. కార్తిక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం  కార్తిక మాసంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అని చెప్పాలి. ఈ రోజు శివకేశవులను పూజించడం, నదీ స్నానం, దీపారాధన, దీప దానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఆలయాలలో జ్వాలా తోరణం కాలుస్తారు.  ఇది శివ స్వరూపంగా భావిస్తారు. నవంబర్ 27న ప్రదోష కాలంలో చతుర్ది తిథి ఉంది.  సంకట చతుర్ధి పర్వదినం.  ఈ రోజు సంకట చతుర్ధి వ్రతం చేసుకుంటే అన్ని విఘ్నాలు తొలిగిపోయాయి. మంచి జరగుతుందనేది విశ్వాసం. డిసెంబర్ 4న కార్తిక బహుళ ఏకాదశి  పర్వదినం.. డిసెంబర్ 8న కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగింపు.

డిసెంబర్ 4న  కార్తీక మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదవిని ఉత్పత్తి ఏకాదశిగా పిలుస్తారు.  ఈ రోజునే ఏకాదశి అనే దేవత విష్ణువు దేహం నుండి జన్మించి ముర అనే రాక్షసుడిని సంహరించిందని పురాణాలు చెబుతాయి. ఈ రోజు ఉపవాసం, విష్ణువును పూజించడం ఫలప్రదం.

డిసెంబర్ 7న మాస శివరాత్రి రోజు చేసే అభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉంది. డిసెంబర్ 8న పోలీ అమావాస్య లేదా పోలీ స్వర్గంగా అభివర్ణిస్తుంటారు. ఈ రోజు ఆకాశ దీపంతో కార్తీక మాస దీక్ష ముగుస్తుంది.


Disclaimer: మేము ప్రస్తావించబడిన అంశాలు.. హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాలు.. పంచాంగాలతో పాటు పండితులు, పెద్దవాళ్లు  చెప్పిన విషయాన్నే మేము ప్రస్తావించాము. జీ న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Telugu Astrology
Daily Horoscope