SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Karthika Masam Rajayoga: కార్తీక మాసంలో ఈ 6 రాశులకు విపరీతమైన రాజయోగం..పరమశివుని కృతలో లక్ష్మీకటాక్షం!

Karthika Masam Rajayoga Zodiac Signs: ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు పవిత్ర కార్తీక మాసం కొనసాగనుంది. పరమశివునికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో గ్రహాల అనుకూల సంచారం వల్ల ఆరు రాశుల వారికి అపూర్వమైన రాజయోగాలు కలగనున్నాయి. గురు, శుక్ర, బుధ, కుజ గ్రహాల శుభ స్థానాల ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఊహించని ధన లాభాలు, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతి లభిస్తాయి. పరమేశ్వరుని ఆరాధన, పాత మొక్కుబడుల చెల్లింపుతో వీరి అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

Written By Harish Darla
Published: Nov 01, 2026, 04:03 PM IST | Updated: Nov 01, 2026, 04:15 PM IST
Join

Karthika Masam Rajayoga Zodiac Signs: ఆధ్యాత్మికంగానూ జ్యోతిష్యపరంగానూ అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో గ్రహాల స్థితిగతులు కొన్ని రాశుల వారికి ఎంతో సానుకూలంగా మారబోతున్నాయి. నవంబర్ 10 నుండి డిసెంబర్ 8 వరకు ఉండే ఈ సమయంలో శుభ గ్రహాలైన గురువు, బుధుడు, శుక్రుడు, కుజుడు అనుకూల స్థానాలలో పయనించడం వల్ల విశేష దైవానుగ్రహం లభిస్తుంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, పూర్వపు మొక్కుబడులు చెల్లించుకోవడం వల్ల శుభ ఫలితాలు వేగంగా అందుతాయి. ముఖ్యంగా ఆరు రాశుల వారి జాతకాల్లో ఆర్థిక, వ్యక్తిగత పురోగతి కనిపిస్తోంది.

1) మేష రాశి
పంచమ స్థానంలో గురు గ్రహం, సప్తమంలో శుక్ర - బుధుల సంచారం వల్ల ఆకస్మిక ధనయోగాలు పడతాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు వస్తాయి. నిలిచిపోయిన బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు వేతనాల పెంపుతో రాబడి పెరిగి కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతుంది.

2) మిథున రాశి 
రాశ్యాధిపతి బుధుడు శుక్రుడితో కలవడం, తృతీయంలో గురు - కుజుల సంచారంతో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఊహించిన దానికంటే ఎక్కువ రాబడి రావడం, పాత ఆస్తి తగాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తులు కలసిరావడంతో పాటు విదేశీ ఆదాయం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

3) కర్కాటక రాశి 
ధన స్థానంలో గురు - కుజులు, చతుర్థంలో శుక్ర - బుధుల కలయిక వల్ల సంపద విపరీతంగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా శివార్చన లేదా అభిషేకం చేయడం ఎంతో శ్రేయస్కరం. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం, షేర్ మార్కెట్, ఆర్థిక లావాదేవీల రంగాల్లో ఉన్నవారికి విశేష లాభాలు చేకూరుతాయి.

4) తులా రాశి
స్వక్షేత్రంలో శుక్ర, బుధులు పయనించడం, లాభ స్థానంలో గురు - కుజ యుతి ఏర్పడటంతో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ, కుబేర యోగాలు పట్టిందల్లా బంగారంగా మారుస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం లేదా ప్రేమ బంధం కుదిరే సూచనలు ఉన్నాయి.

5) ధనుస్సు రాశి 
లాభ స్థానంలో దశమ, లాభాధిపతులు కలవడం, భాగ్య స్థానంలో గురు - కుజులు ఉండటంతో సకల రంగాల్లో విజయాలు వరిస్తాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. ఉన్నత కుటుంబాలతో పరిచయాలు, వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి.

6) కుంభ రాశి 
భాగ్య స్థానంలో శుక్ర - బుధులు, సప్తమంలో గురు ప్రవేశంతో ఏలినాటి శని తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభించి ఆదాయం పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందడంతో పాటు కుటుంబంలో మాంగళ్య కార్యాలు జరుగుతాయి.

ఈ విధంగా కార్తీక మాసంలో ఈ ఆరు రాశుల వారు పరమశివుడిని నిష్టతో ఆరాధించడం వల్ల ఆర్థికంగా, వ్యక్తిగతంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES