• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Singer Jhansi: బిగ్‌బాస్‌ 10 సీజన్‌ వీడడంపై సింగర్‌ ఝాన్సీ భావోద్వేగం!

Singer Jhansi: బిగ్‌బాస్‌ 10 సీజన్‌ వీడడంపై సింగర్‌ ఝాన్సీ భావోద్వేగం!

Singer Jhansi Emotional Words After Elimination From Bigg Boss Telugu 10: కామనర్‌గా అగ్ని పరీక్షలో ప్రవేశించి అన్ని పరీక్షల్లో సత్తా చాటి నేరుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ ఎట్టకేలకు 8వ వారానికి ఆమె జర్నీ ముగిసింది. బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడిన సందర్భంగా ఝాన్సీ భావోద్వేగానికి లోనయ్యారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 01, 2026, 04:55 PM IST|Updated: Nov 01, 2026, 05:00 PM IST
joinshare
Singer Jhansi: బిగ్‌బాస్‌ 10 సీజన్‌ వీడడంపై సింగర్‌ ఝాన్సీ భావోద్వేగం!
Image Credit: Singer Jhansi Elimination

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Soft Rotis: చపాతి, రొటీలు గంటల పాటు కాటన్‌లా మెత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు తెలుసుకోండి!

Soft Rotis: చపాతి, రొటీలు గంటల పాటు కాటన్‌లా మెత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు తెలుసుకోండి!

2

IND vs NZ Highlights: ఆఖరి మ్యాచ్‌లోనూ భారత్ బోల్తా.. 3-2 తేడాతో టీ20 సిరీస్‌ ముగింపు

3

DMart Shopping Tips 2026: డి మార్ట్ షాపింగ్‌లో సీక్రెట్ ట్రిక్స్..ఇలా కొంటే డబ్బు వృథా కాదు.. ఏడాదికి రూ.50 వేలు సేవ్!

4

Singer Jhansi: బిగ్‌బాస్‌ 10 సీజన్‌ వీడడంపై సింగర్‌ ఝాన్సీ భావోద్వేగం!

5

Singer Jhansi: అగ్నిపరీక్ష నుంచి 8 వారాలు బిగ్‌బాస్‌లో.. సింగర్‌ ఝాన్సీ రెమ్యునరేషన్‌ ఎంత?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bigg Boss Telugu 10 Elimination: ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్‌బాస్‌ తెలుగు 10వ సీజన్‌ అత్యంత రసవత్తరంగా కొనసాగుతోంది. అనేక ట్విస్ట్‌లు.. టాస్క్‌లతో కొనసాగుతున్న బిగ్‌బాస్‌ షో 8వ వారానికి చేరుకుంది. అనూహ్య పరిణామాల మధ్య హౌస్‌ నుంచి వైదొలిగిన తెలంగాణ రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ భావోద్వేగానికి లోనయ్ఆరు. ఊహించని పరిణామాల మధ్య హౌస్‌ నుంచి బయటకు వచ్చిన సింగర్‌ ఝాన్సీ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తనను ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

'నా ప్రియమైన ప్రేక్షక దేవుళ్లకు.. నా ఝాన్సీ ఆర్మీకి.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. బిగ్‌బాస్ 10 హౌస్ నుంచి నా ప్రయాణం నేటితో ముగిసి ఉండవచ్చు. కానీ మీ అందరి గుండెల్లో నాకు ఇచ్చిన స్థానం నా జీవితాంతం మర్చిపోలేను' అని సింగర్‌ ఝాన్సీ ప్రకటించారు. అగ్నిపరీక్ష గెలిచి హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నిన్నటి వరకు తనకు అందించిన మద్దతు మాటల్లో చెప్పలేనిదని తెలిపారు. 'హౌస్‌లో నేను ఒంటరిగా ఆడుతున్న ప్రతిసారి మీరంతా నా వెనుక కొండంత అండగా నిలబడ్డారు. గ్రూపు రాజకీయాలు, ఫేక్ డ్రామాలు లేకుండా నేను నా నిజాయితీని, నా సంస్కారాన్ని నమ్ముకుని ఆడిన ఆటకు మీరు ఇచ్చిన విలువ, వేసిన ప్రతి ఒక్క ఓటు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి' అని సింగర్‌ ఝాన్సీ వివరించారు.

'టాస్కుల్లో నేను 100 శాతం ప్రాణం పెట్టి ఆడినప్పుడు నాగార్జున సర్ ఇచ్చిన ప్రశంసలు, మీరంతా నా మానవత్వాన్ని మెచ్చుకుంటూ పంపిన మెసేజ్‌లు నా జీవితానికి దొరికిన అతిపెద్ద అవార్డులు' అని సింగర్‌ ఝాన్సీ పేర్కొన్నారు. 'ట్రోఫీ కంటే నాకు మీ ప్రేమే ముఖ్యం. బిగ్‌బాస్ హౌస్ ప్రయాణం ముగిసిపోయినా మీ ఝాన్సీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. మళ్లీ నా పాటలతో, నా మట్టి వాసనతో మీ ముందుకు వస్తా' అని సింగర్‌ ఝాన్సీ ప్రకటించారు. 'నన్ను మీ ఇంట్లో ఆడపడుచుగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇకపై కూడా మీ ప్రేమ, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని ఝాన్సీ తెలిపారు. ఆట ముగిసినా.. నిజాయితీ, పోరాట పటిమ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉంటాయి ఝాన్సీ పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Bigg Boss
Trending News
Telugu News