• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /Soft Rotis: చపాతి, రొటీలు గంటల పాటు కాటన్‌లా మెత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు తెలుసుకోండి!

Soft Rotis: చపాతి, రొటీలు గంటల పాటు కాటన్‌లా మెత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు తెలుసుకోండి!

Soft Chapati Recipe: చపాతీ లేదా రొటీ మన ఇళ్లలో ప్రతిరోజూ చేసే ఆహారం. కానీ చాలాసార్లు మనం చేసిన రొటీ కొద్దిసేపటికే గట్టిగా మారిపోతుంది. బయట హోటళ్లలో లేదా టిఫిన్ సెంటర్లలో మాత్రం రొటీలు గంటల పాటు మృదువుగా ఉంటాయి. అసలు రహస్యం ఏమిటి? చాలా సులభమైన కొన్ని చిట్కాలు పాటిస్తే మన ఇంట్లో కూడా రొటీలు గంటల పాటు మెత్తగా ఉంచుకోవచ్చు.

Written ByVishnu Priya
Published: Nov 01, 2026, 05:54 PM IST|Updated: Nov 01, 2026, 05:58 PM IST
joinshare
Soft Rotis: చపాతి, రొటీలు గంటల పాటు కాటన్‌లా మెత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు తెలుసుకోండి!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Soft Rotis: చపాతి, రొటీలు గంటల పాటు కాటన్‌లా మెత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు తెలుసుకోండి!

Soft Rotis: చపాతి, రొటీలు గంటల పాటు కాటన్‌లా మెత్తగా ఉండాలంటే ఈ చిట్కాలు తెలుసుకోండి!

2

IND vs NZ Highlights: ఆఖరి మ్యాచ్‌లోనూ భారత్ బోల్తా.. 3-2 తేడాతో టీ20 సిరీస్‌ ముగింపు

3

DMart Shopping Tips 2026: డి మార్ట్ షాపింగ్‌లో సీక్రెట్ ట్రిక్స్..ఇలా కొంటే డబ్బు వృథా కాదు.. ఏడాదికి రూ.50 వేలు సేవ్!

4

Singer Jhansi: బిగ్‌బాస్‌ 10 సీజన్‌ వీడడంపై సింగర్‌ ఝాన్సీ భావోద్వేగం!

5

Singer Jhansi: అగ్నిపరీక్ష నుంచి 8 వారాలు బిగ్‌బాస్‌లో.. సింగర్‌ ఝాన్సీ రెమ్యునరేషన్‌ ఎంత?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Roti Making Tips: మొదటి ముఖ్యమైన విషయం పిండి కలపడం. సాధారణంగా మనం చల్లటి నీటితో పిండి కలుపుతాం. కానీ వేడి నీటితో పిండి కలిపితే రొటీ చాలా మృదువుగా అవుతుంది. వేడి నీరు పిండిలోని పదార్థాలను కొద్దిగా ఉడికినట్లుగా చేసి, పిండి సాఫ్ట్‌గా మారుతుంది. దీంతో రొటీలు త్వరగా ఎండిపోవు.

రెండవ చిట్కా పాలు లేదా మలై ఉపయోగించడం. పిండి కలుపుతున్నప్పుడు కొద్దిగా గోరువెచ్చని పాలు లేదా ఒక చెంచా మలై వేసుకుంటే రొటీ ఇంకా మెత్తగా ఉంటుంది. పాలలో ఉన్న కొవ్వు పిండిని మృదువుగా ఉంచుతుంది. ఇది రొటీకి మంచి రుచి కూడా ఇస్తుంది.

మూడవ విషయం పిండి విశ్రాంతి. చాలా మంది పిండి కలిపిన వెంటనే రొటీలు వేస్తారు. కానీ పిండి కనీసం 20 నుంచి 30 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఇలా ఉంచితే పిండి బాగా సాఫ్ట్‌గా మారి, రొటీలు పొంగుతూ మెత్తగా వస్తాయి.

నాలుగవ చిట్కా మంట. చాలా మంది తక్కువ మంటపై రొటీ వేస్తారు. ఇది పెద్ద తప్పు. ఎక్కువ మంటపై రొటీ వేయాలి. అప్పుడు రొటీ త్వరగా పొంగి లోపల తేమ అలాగే ఉంటుంది. దీంతో రొటీ గట్టిపడదు.

ఐదవ విషయం నెయ్యి లేదా వెన్న. రొటీ వేయగానే వెంటనే కొద్దిగా నెయ్యి లేదా వెన్న రాయాలి. ఇది రొటీ లోపల ఉన్న తేమ బయటకు పోకుండా కాపాడుతుంది. అందుకే నెయ్యి రాసిన రొటీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి.

చివరి చిట్కా నిల్వ విధానం. రొటీలు వేడి వేడి గానే డబ్బాలో వేస్తే అవి తడిగా మారిపోతాయి లేదా పైభాగం గట్టిపడుతుంది. అందుకే డబ్బాలో ముందుగా ఒక పత్తి గుడ్డ లేదా టిష్యూ పెట్టాలి. ఇది అదనపు ఆవిరిని తీసుకుని రొటీలు మెత్తగా ఉంచుతుంది.

Select Language

Zee News Telugu

App

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • వ్యాపారం
  • జీవనశైలి
  • వృత్తి
  • ఆధ్యాత్మికం

  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /మావోయిస్టులు మళ్లీ పుడతారు.. మాజీ సీఎం సంచలన కామెంట్స్..!!

మావోయిస్టులు మళ్లీ పుడతారు.. మాజీ సీఎం సంచలన కామెంట్స్..!!

 

Maoists: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ సందర్భంగా సాగుతున్న పోలింగ్ సరళిపై వైఎస్సార్‌సీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు ప్రత్యక్షంగా సహకరిస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దీనికి పులివెందులలో చోటుచేసుకుంటున్న ఉదంతాలే స్పష్టమైన ఆధారమన్నారు.

Written ByBhoomi

Published: Nov 01, 2026, 03:24 PM IST|Updated: Nov 01, 2026, 03:25 PM IST

మావోయిస్టులు మళ్లీ పుడతారు.. మాజీ సీఎం సంచలన కామెంట్స్..!!

Image Credit: Maoists:

joinshare

 Maoists: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ సందర్భంగా సాగుతున్న పోలింగ్ సరళిపై వైఎస్సార్‌సీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు ప్రత్యక్షంగా సహకరిస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దీనికి పులివెందులలో చోటుచేసుకుంటున్న ఉదంతాలే స్పష్టమైన ఆధారమన్నారు.

 

పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మొత్తం 80 పోలింగ్ కేంద్రాల్లో 70 బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా ఖాళీ చేయించారని జగన్ ఆరోపించారు. ఉదయం 4 గంటల నుంచే అధికార టీడీపీ నేతలు, శ్రేణులు పోలింగ్ బూత్‌లను తమ గుప్పెట్లోకి తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఓటర్లు హక్కును వినియోగించుకునేందుకు వస్తుంటే వారి స్లిప్పులు లాక్కుని, పోలీసుల సాయంతో వెనక్కి పంపించేస్తున్నారని ఆక్షేపించారు.

 

 

 

అధికార పక్షానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని..  అసలు ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని నిలదీశారు. కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉంటూ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారని వైఎస్  జగన్  ప్రశ్నించారు. కనీసం పారదర్శకత నిలిచేలా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా అమర్చకపోవడంపై జగన్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలి, బాధితులకు న్యాయం దక్కనప్పుడే ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగుల్తాయన్నారు. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిన వాతావరణంలోనే మావోయిస్టుల వంటి పరిణామాలు, కాక్రోచ్‌లు పుట్టుకొస్తాయన్నారు వైఎస్ జగన్. పులివెందులతో సహా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అక్రమ ఎన్నికల విధానాన్ని తీవ్రంగా నిరసించిన జగన్.. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Also Read: 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News