• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Karthika Masam: కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రం? శివుడు, తులసీని ఎందుకు పూజించాలి?

Karthika Masam: కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రం? శివుడు, తులసీని ఎందుకు పూజించాలి?

Karthika Masam Why Spiritually Special: హిందూ క్యాలెండర్‌లో పరమపవిత్రమైన మాసాల్లో కార్తీకమాసం ఒకటి. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం ఎందుకు అంత ప్రత్యేకత? భారతీయ సంస్కృతిలో కీలకమైన ఈ మాసంలో శివుడిని ఎందుకు పూజించాలి? తులసీ పూజకు సంబంధం ఏమిటో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Nov 06, 2026, 07:24 PM IST|Updated: Nov 06, 2026, 07:53 PM IST
joinshare
Karthika Masam: కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రం? శివుడు, తులసీని ఎందుకు పూజించాలి?
Image Credit: Karthika Masam 2026

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Ponnam Prabhakar: కుర్చీలో దర్జాగా డిపో మేనేజర్, నేలపై ఆర్టీసీ కార్మికులు.. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్..

Ponnam Prabhakar: కుర్చీలో దర్జాగా డిపో మేనేజర్, నేలపై ఆర్టీసీ కార్మికులు.. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్..

2

Murali Mohan: ఎన్టీఆర్‌పై అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చా.. నెగెటివిటీని కూడా ఎదుర్కొన్నా: మురళీమోహన్

3

Kaaka Movie: చిరంజీవి కాకా రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతికి మెగాస్టార్ సినిమా రావడం పక్కా!

4

Ramayana: రణబీర్ కపూర్ రామాయణం చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న..!

5

Hanuman Ansh OTT Release Date: రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్ అంశ్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Karthika Masam Special: భారతీయ హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన.. ఆధ్యాత్మిక శక్తితో నిండిన మాసంగా కార్తీకమాసం పరిగణిస్తారు. శ్రావణమాసం మాదిరి కార్తీకమాసానికి కూడా విశేష ప్రాధాన్యం ఉంది. పెద్ద ఎత్తున భక్తులు కార్తీకమాసంలో ఉపవాసాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. నిత్యం శివరాధన చేస్తుంటారు. దీపారాధన చేస్తూ శివానుగ్రహం కోసం భక్తులు ప్రయత్నిస్తుంటారు. చాతుర్మాసంలో చివరి మాసం కావడంతో శాస్త్రాలు అన్ని మాసాలలోకెల్లా శ్రేష్ఠమైనదిగా కార్తీకమాసాన్ని వర్ణించాయి.

'మాసానాం కార్తీకః శ్రేష్ఠః' అనే వాక్యం కార్తీక మాసం విశిష్టతను తెలియజేస్తుంది. నాలుగు నెలల యోగనిద్ర అనంతరం శ్రీమహావిష్ణువు మేల్కొని తిరిగి సృష్టి నిర్వహణ బాధ్యతలను స్వీకరించే పవిత్ర కాలం ఇదే. దీనివల్ల కార్తీకమాసంలో ఆచరించే ప్రతి ధార్మిక కార్యం విశేష ఫలితాలను అందిస్తుందని భక్తుల విశ్వాసం. విష్ణు-లక్ష్మీ దేవతల అనంతమైన అనుగ్రహం, ఈ పవిత్ర మాసాన్ని ‘దామోదర మాసం’ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో శ్రీమహావిష్ణువును, మహాలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడంతో జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సంపద, ధాన్యసమృద్ధి కలుగుతాయని విశ్వసిస్తారు.

తులసీ పూజ
కార్తీక మాసంలో తులసీ పూజ చేస్తుంటారు. కార్తీకమాసానికి తులసీదేవికి ఎంతో అనుబంధం ఉంది. ఈ మాసమంతా తులసి మొక్క సమీపంలో దీపం వెలిగించడం, తులసీ వివాహాన్ని నిర్వహించడంతో ఇంట్లో అపారమైన శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. పద్మ పురాణం, స్కాంద పురాణం వంటి పురాణాల ప్రకారం కార్తీక మాసం మానవ జీవితంలోని నాలుగు పురుషార్థాలైన ధర్మం, అర్థం, కామం, మోక్షాలను సాధించడానికి అనుకూలమైన పవిత్ర కాలం. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున పవిత్ర స్నానాలు ఆచరించడంతో మనస్సు, ఆత్మశుద్ధి చెంది ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుందని విశ్వసిస్తారు.

పండుగల మాసం
కార్తీకమాసంలో దీపావళి పండుగ, కర్వా చౌత్‌, భాయీ దూజ్‌, కార్తీక పౌర్ణమి, ఛఠ్ పూజ, గోవర్ధన పూజ, తులసీ కల్యాణం వంటివి విశిష్ట పూజా కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఆయా విశిష్ట పండుగలు ఈ కార్తీక మాసంలో చేసుకుంటుంటారు.

దీపారాధన
కార్తీక పౌర్ణమి రోజున దేవతలు ఆనందంతో దీపాలు వెలిగించి ఉత్సవం చేసుకున్నారని పురాణగాథలు వివరిస్తాయి. అందుకే ఈ రోజున గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం.. దీపదానం చేయడం అత్యంత విశిష్టమైన ఆచారాలుగా పరిగణిస్తారు.

కార్తీక మాస పౌరాణిక గాథ
కార్తీక మాసానికి సంబంధించి అనేక పౌరాణిక గాథలు ఉన్నాయి. పురాణ కథనం ప్రకారం తారకాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరాన్ని పొందాడు. ఆ వరం ప్రకారం పరమశివుడి కుమారుడి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించాలని వరం పొందడంతో అతడు అకృత్యాలకు పాల్పడేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఉందనే అహంకారంతో తారకాసురుడు ముల్లోకాల్లో అకృత్యాలకు పాల్పడుతూ.. దేవతలను స్వర్గం నుంచి తరిమివేసి తీవ్రంగా హింసించడం ప్రారంభించాడు. ఇక తారకాసురుడికి తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు కొడుకులు ఉండగా.. వీరు కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారు. మూడు అజేయమైన నగరాలను నిర్మించుకునే వరాన్ని ఆ ముగ్గురు కుమారులు బ్రహ్మాదేవుడి నుంచి వరం పొందారు. ఈ మూడు నగరాలను ‘త్రిపురాలు’ అని పిలుస్తారు. త్రిపురాలు బంగారం, వెండి, ఇనుములతో నిర్మించబడి అంతరిక్షంలో సంచరించే శక్తిని కలిగి ఉండేవి. ఆ వరం ప్రకారం వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆ మూడు నగరాలు ఒకే సరళరేఖలోకి వచ్చేవి. అప్పుడు మాత్రమే వాటిని ఒకే బాణంతో నాశనం చేయడం సాధ్యమయ్యేది. రాక్షసుల అకృత్యాలతో తీవ్రంగా బాధపడిన దేవతలందరూ పరమశివుడిని  శరణు వేడుకున్నారు. దేవతలను రక్షిస్తానని శివుడు వారికి అభయమిచ్చాడు. కార్తీక పౌర్ణమి రోజున ఆ మూడు నగరాలు ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు, పరమశివుడు తన దివ్య ధనుస్సును ధరించి, ఒకే బాణంతో ఆ మూడు నగరాలను భస్మం చేశాడు. అందుకే కార్తీక పౌర్ణమికి అంతటి ప్రాధాన్యం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Telugu News
Trending News