• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /కుజ దోషంతో బాధ పడుతున్నారా..!! ఇలా చేస్తే సొంత ఇల్లు, పెళ్లి గ్యారంటీ..

కుజ దోషంతో బాధ పడుతున్నారా..!! ఇలా చేస్తే సొంత ఇల్లు, పెళ్లి గ్యారంటీ..

Kuja Dosham: ప్రతి 100 మంది జాతకంలో 80 శాతం మంది కుజ దోషంతో బాధపడుతుంటారు. దీని వలన పెళ్లి ఆలస్యంతో పాటు పలు సమస్యలు వెంటాడుతుంటాయి. అంతేకాదు సొంత ఇంటి కల కూడా నెరవేరకుండా పోతుంది. అయితే ఇలా చేస్తే జాతకంలో కుజ దోష ప్రభావం తగ్గి మంచి ఫలితాలను అందుకుంటారని జ్యోతిష్య పండిత్ నాగరాజ్ వర్మ చెబుతున్న మాట.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 05, 2026, 06:47 AM IST|Updated: Nov 05, 2026, 07:03 AM IST
joinshare
కుజ దోషంతో బాధ పడుతున్నారా..!! ఇలా చేస్తే సొంత ఇల్లు, పెళ్లి  గ్యారంటీ..
Image Credit: Kuja Dosham (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Ramayana Twitter Review: 'రామాయణ' సినిమా ట్విట్టర్ రివ్యూ..అద్భుతంగా ఉందా? మరో 'ఆదిపురుష్' చేశారా?

Ramayana Twitter Review: 'రామాయణ' సినిమా ట్విట్టర్ రివ్యూ..అద్భుతంగా ఉందా? మరో 'ఆదిపురుష్' చేశారా?

2

కుజ దోషంతో బాధ పడుతున్నారా..!! ఇలా చేస్తే సొంత ఇల్లు, పెళ్లి గ్యారంటీ..

3

AP ZPTC MPTC Election: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రారంభం..భారీ భద్రత, వర్షాల నడుమ ఎన్నికల ప్రక్రియ!

4

చాణక్య నీతి: ఇలాంటి భార్య పక్కలో బల్లెం లాంటిది.. ఇంట్లోనే శత్రువుతో సమానం..!

5

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శ్రీరాముడి పాత్రలో నటించిన హీరోలు.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kuja Dosham Remedies: మన దగ్గర దాదాపు మెజారిటీ ప్రజల జాతకంలో కుజ దోషం ఏదో విధంగా బాధపడుతూ ఉంటారు.  అంతేకాదు చేస్తోన్నఉద్యోగంలో  ప్రమోషన్ పొందడానికి  కుజ దోషం అడ్డు తగులుతూ ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేక రత్నాలను ధారణ వల్ల మంచి ప్రయోజనాలు అందుకునే అవకాశాలున్నాయని పండిత్ నాగరాజ్ శర్మ చెబుతున్న మాట.

ఇది మన జీవితంలో వచ్చే కష్టాలను కొంత మేరకు తగ్గించే అవకాశాలున్నాయి. పూర్తి స్థాయిలో మాత్రం తగ్గించలేవు. మన పూర్వ కర్మ జన్మ ఫలితం.. మనం చేసే కర్మల ఆధారంగామంచి ఫలితాలను అందుకుంటారని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.  

రత్నాలలో పగడము కుజుడికి సంబంధించిన రత్నం. ఈ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో అన్ని అడ్డంకులు తొలిగి పోతాయి. అంతేకాదు జీవితంలో ఎంతో  ఉపశమనం లభించే అవకాశాలున్నలయి.  మనిషి ఆరోగ్యంగా.. శారీరకంగా.. మానసికంగా శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది.కుజుడు నవగ్రహాల్లో సర్వ సైన్యాధ్యక్షుడు. ఇక కుజుడికి సంబంధించిన పగడం ధరించే ముందు ఏయే క్రతువులు నిర్వహించాలో చూద్దాం.  

-పగడము ధరించే ముందు చేయవలసిన పూజా ఇతరత్రా.. నియమాలు.. 

-జీవితంలో మంచి ఫలితాలను అందుకోవడానికి పగడపు ధరించే ముందు జ్యోతిష్యులు లేదా పండితుల సలహా తీసుకోండి..

-పగడాన్ని బంగారం లేదా రాగితో  ధరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.

-ముఖ్యంగా ఈ రత్నాన్ని ఏదైనా మంచి శుభ ముహూర్తం ఉన్న మంగళవారం రోజునే ఎంచుకుని ధరించాల్సి ఉంటుంది.  

-పగడపు ఉంగరాన్ని ధరించే ముందు ఉంగరాన్ని పచ్చిపాలలో కానీ గంగా జలంలో ఉంచి అభిషేకించాలి.

-అంతేకాదు మంగళవారం రోజున హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పూజ చేసిన తర్వాత ఈ ఉంగరం ధరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.

పగడపు ఉంగరాన్ని ధరించే ముందు బాగా కడగి శుభ్రం చేసి తొడుక్కోవాలి. పగడపు ఉంగరాన్ని చేతి చూపుడు వేలికి కానీ.. 
ఉంగరం వేలుకు కానీ ధరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు.


పగడపు ఉంగరం ధరించడం వలన కలిగే ప్రయోజనాలు..

పగడాన్ని ధరించడం వల్ల వివాహా జీవితంలో సమస్యలు తొలిగిపోయే  అవకాశాలున్నాయి. పగడం ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభించనుంది.  

కెరీర్‌లో అడ్డంకులు తొలిగించడంలో పగడపు ఉంగరం సహాయం చేస్తోంది. పగడాన్ని ధరించడం వల్ల ఆ వ్యక్తి యెక్క  శక్తి , ఆత్మ విశ్వాసం పెరుగుతోంది.

పగడం ధరించిన ఉంగరం ధరించడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తోంది.

పగడపు ఉంగరం ధరించడం వల్ల ప్రతికూలత తొలిగిపోయి మానసిక ఒత్తిడి తగ్గే అవకాశాలున్నాయి.  


Disclaimer (గమనిక):ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని జీ మీడియా న్యూస్ చెప్పడం లేదు. ఇవి ఆయా గ్రహాల సంచారంతో పాటు కఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇది మారుతు ఉంటుంది. ఇతర వివరాల కోసం.. జ్యోతిష్య పండితులు తంజావూర్ నాగరాజ శర్మ, ఈ మెయిల్‌ ID: tanarsharma@gmail.com, ఫోన్: 9395354502 సంప్రదించండి.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Spirituality
Daily Horoscope