• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP ZPTC MPTC Election: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రారంభం..భారీ భద్రత, వర్షాల నడుమ ఎన్నికల ప్రక్రియ!

AP ZPTC MPTC Election: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రారంభం..భారీ భద్రత, వర్షాల నడుమ ఎన్నికల ప్రక్రియ!

AP ZPTC MPTC Election 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో భాగంగా నేడు జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాల కోసం 18,843 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల పారదర్శకమైన నిర్వహణ కోసం 38 వేల మందికి పైగా పోలీసులతో పటిష్ట భద్రతను సిద్ధం చేశారు.

Written ByHarish Darla
Published: Nov 05, 2026, 06:36 AM IST|Updated: Nov 05, 2026, 06:38 AM IST
joinshare
AP ZPTC MPTC Election: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రారంభం..భారీ భద్రత, వర్షాల నడుమ ఎన్నికల ప్రక్రియ!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Ramayana Twitter Review: 'రామాయణ' సినిమా ట్విట్టర్ రివ్యూ..అద్భుతంగా ఉందా? మరో 'ఆదిపురుష్' చేశారా?

Ramayana Twitter Review: 'రామాయణ' సినిమా ట్విట్టర్ రివ్యూ..అద్భుతంగా ఉందా? మరో 'ఆదిపురుష్' చేశారా?

2

కుజ దోషంతో బాధ పడుతున్నారా..!! ఇలా చేస్తే సొంత ఇల్లు, పెళ్లి గ్యారంటీ..

3

AP ZPTC MPTC Election: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రారంభం..భారీ భద్రత, వర్షాల నడుమ ఎన్నికల ప్రక్రియ!

4

చాణక్య నీతి: ఇలాంటి భార్య పక్కలో బల్లెం లాంటిది.. ఇంట్లోనే శత్రువుతో సమానం..!

5

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శ్రీరాముడి పాత్రలో నటించిన హీరోలు.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP ZPTC MPTC Election 2026: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సమయం కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలు బరిలో ఉన్నాయి. ఈ స్థానాల్లో విజయం సాధించేందుకు మొత్తం 18,843 మంది అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు.

పోలింగ్ కేంద్రాలు, అధికారుల నియామకం..
ఈ భారీ ఎన్నికల ప్రక్రియను సుఫీలుంగా పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలను సకల సదుపాయాలతో ఏర్పాటు చేశారు. ఓటింగ్ పర్యవేక్షణ కోసం 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు, అలాగే 1,41,332 మంది పోలింగ్ అధికారులు నేరుగా విధుల్లో పాల్గొంటున్నారు.

పటిష్ట భద్రతా చర్యలు..
ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం 38 వేల మందికి పైగా పోలీసు అధికారులతో భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు. భద్రతా విశ్లేషణల ఆధారంగా 9,966 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, 9,186 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ అత్యున్నత స్థాయి భద్రతను పూర్తి చేశారు. అలాగే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఓటర్లకు, అధికారులకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కూటమి శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం..
ఇటీవల పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయోత్సాహంతో 94 శాతం స్ట్రైక్ రేట్‌ను మించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా పార్టీ క్రమశిక్షణ తప్పే నాయకులకు పార్టీలో ఎలాంటి స్థానం లేదని ఆయన ఖచ్చితంగా తేల్చిచెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Elections
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
Telugu News