Lakshmi Narayana Raj Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు మానవ జీవితంపై చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి.. ఇదిలా ఉంటే నవంబర్ 22వ తేదీన ఒక అరుదైన గ్రహ కలయిక జరగబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. సంపద, విలాసాలకు కారకుండిగా భావించే శుక్రుడు.. తెలివితేటలు, వ్యాపారానికి అధిపతిగా చెప్పుకునే బుధుడు ఒకే రాశిలో కలయిక జరపడం కారణంగా ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..
పంచాంగం ప్రకారం.. నవంబర్ 22 సాయంత్రం 5:21 గంటలకు శుక్రుడు సొంత రాశిగా భావించే తులారాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు.. అప్పటికే తులారాశిలో సంచరిస్తున్న బుధుడితో శుక్రుడు కలయిక జరుపుతాడు. దీని కారణంగానే ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పుడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. బుధుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించే.. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ శుభయోగం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ పది రోజుల పాటు కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్బుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరి.. అద్భుతమైన లాభాలు సొంతం చేసుకుంటారు.
మేష రాశి:
ఈ శక్తివంతమైన రాజయోగం ఎఫెక్ట్‌తో మేష రాశి వారికి అన్ని విధాలుగా బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కార్యాలయంలో గుర్తింపుతో పాటు పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి.. ఎప్పటినుంచో వసూలు కాకుండా నిలిచిపోయిన మొండి బాకీలు తిరిగి చేతికి అందే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.
తులారాశి:
తులారాశికి శుక్రుడే అధిపతి కావడం వల్ల.. ఇదే రాశిలో ఏర్పడుతున్న ఈ యోగం వీరికి అత్యంత శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఆశించిన పురోగతితో పాటు జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయంగా భావించవచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొంతకాలంగా అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో తప్పకుండా విజయాలు కలుగుతాయి.. మనసులోని కోరికలు నెరవేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన శుభవార్తలు కూడా సులభంగా లభిస్తాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారి కెరీర్, ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల మార్పులు వస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. వ్యాపారస్తులు భారీ లాభాలు కూడా పొందుతారు.. కొత్త వ్యాపారాలు చేయాలనుకునేవారికి కూడా బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగువేయడం చాలా మంచిది..
NOTE: