SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశులకు అక్టోబర్ 29 నుంచి గోల్డెన్ టైమ్!

Lakshmi Narayana Rajyoga: ఈ రోజు ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఎక్కువ లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 29, 2026, 02:42 PM IST | Updated: Oct 29, 2026, 02:45 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Lakshmi Narayana Rajyoga Effect: అక్టోబర్ 29వ తేదికి జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఈ రోజే తులా రాశిలో ఎంతో శక్తివంతమైన, అత్యంత శుభప్రదమైన లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడింది. అయితే, ఈ యోగ ప్రభావం గురువారం నుంచి ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మూడు రాశులవారికి బంపర్‌ లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు వ్యాపారంలో కూడా గొప్ప వృద్ధి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ యోగంతో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగానే లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. అయితే, బుధుడిని తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారంతో పాటు నిర్ణయాలకు కారకుడి చెప్పుకుంటూ ఉంటారు. అయితే, శుక్రుడు సౌకర్యం, సంపద, ఆకర్షణకు సూచికగా భావిస్తూ ఉంటారు. అయితే, ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగానే శక్తివంతమైన ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ కింది 3 రాశులవారికి గోల్డెన్‌ టైమ్‌ ప్రారంభం కాబోతోంది.

ఈ రాశులవారికి లాభాలే, లాభాలు:
తులారాశి:
ఈ శక్తింవంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో తులా రాశివారికి ఎన్నో రకాల కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ఈ సమయం గోల్డెన్‌ టైమ్‌గా మారుతుంది. ఉద్యోగంలో అద్భుతమైన పురోగతి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. కొత్త ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉంటారు.

మేష రాశి:
ఎంతో శక్తివంతమైన రాజయోగం కారణంగా మేష రాశివారికి ఈ సమయం చాలా బాగుటుంది. జీవితంలోని అనేక రకాల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంంతేకాకుండా జీవితంలో లోటు కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఉద్యోగంలో పురోగతి కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఈ సమయంలో తప్పకుండా ఆఫర్స్‌ లేటర్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారంలో వృద్ధి కూడా చాలా వరకు లభిస్తాయి. అయితే, ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది.

కన్యారాశి:
పవర్‌ఫుల్ లక్ష్మీనారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో కన్యా రాశివారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ఊహించని పురోగతి కూడా సులభంగా లభిస్తుంది. వీరికి ఈ సమయంలో తప్పకుండా ఆదాయం ఒక్కసారిగా గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో వస్తున్న ఇబ్బందులు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా బాస్‌ నుంచి మంచి సపోర్ట్ కూడా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితంలో అశాంతి కూడా సులభంగా తొలగిపోతుంది. వ్యాపారాల్లో వస్తున్న ఇబ్బందులు కూడా చాలా వరకు తొలగిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి. 

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES