• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /వామ్మో.. అంత ఎత్తులో దున్నపోతు.. వాటర్ ట్యాంక్‌పైకి ఎలా ఎక్కింది?

వామ్మో.. అంత ఎత్తులో దున్నపోతు.. వాటర్ ట్యాంక్‌పైకి ఎలా ఎక్కింది?

Buffalo On Water Tank Video: తాజా ఓ దున్నపోతు అత్యంత ఎత్తైన వాటర్ ట్యాంక్‌పై దర్శనమిచ్చిన దృశ్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా షాక్‌ అయిపోతున్నారు. ఇంతకీ ఈ దున్నపోతు అక్కడి ఎలా ఎక్కింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 29, 2026, 04:33 PM IST|Updated: Oct 29, 2026, 04:35 PM IST
joinshare
వామ్మో.. అంత ఎత్తులో దున్నపోతు.. వాటర్ ట్యాంక్‌పైకి ఎలా ఎక్కింది?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Hyderabad Water: నీటి ఎద్దడి వేళ హైదరాబాద్‌ ప్రజలకు కొత్త యాప్‌.. నీళ్లు వృథా చేస్తే 'పానీ యాప్‌'లో ఫిర్యాదు

Hyderabad Water: నీటి ఎద్దడి వేళ హైదరాబాద్‌ ప్రజలకు కొత్త యాప్‌.. నీళ్లు వృథా చేస్తే 'పానీ యాప్‌'లో ఫిర్యాదు

2

KTR Press Meet: కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డికి హాలిడే ఇస్తే పీడ పోతది: కేటీఆర్‌

3

వామ్మో.. అంత ఎత్తులో దున్నపోతు.. వాటర్ ట్యాంక్‌పైకి ఎలా ఎక్కింది?

4

Prayagraj News: వామ్మో.. ఇంటి కింద మూడు డ్రమ్ముల నిండా డబ్బుల కట్టలు.. అసలు విషయం ఏమిటంటే..?.. వీడియో వైరల్..

5

పాన్ ఇండియా మోజులో టాలీవుడ్! హైప్‌ ఎక్కువ..! కంటెంట్‌ తక్కువ..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Buffalo On Water Tank Video: సోషల్ మీడియాల్లో జంతువులకు సంబంధించిన చిత్రవిచిత్రమైన వీడియోలు రోజు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దృశ్యం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా నేలపై నెమ్మదిగా నడిచే ఓ భారీ దున్నపోతు.. ఏకంగా ఊరి మధ్యలో ఉన్న ఎత్తయిన భారీ నీటి ట్యాంక్ పైభాగంలో ప్రత్యక్షమై అందరికీ ఊహకందని షాక్ ఇచ్చింది.. కొన్ని అడుగుల ఎత్తు ఉన్న ఆ వాటర్ ట్యాంక్‌పైకి అది ఎలా ఎక్కింది? అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. భారీ ఆకారంతో ఉన్న దున్నపోతు ఎత్తయిన వాటర్ ట్యాంక్ పైభాగంలో కనిపించడం మీరు చూడొచ్చు.. అంత ఎత్తులో ఉన్నప్పటికీ.. దాని ముఖంలో ఎలాంటి బెరుకు గానీ.. భయం గానీ కనిపించకపోవడం విశేషం.. సాధారణంగా మనుషులే అంత ఎత్తుకు వెళ్లినప్పుడు కిందికి చూసి వణిపోతూ ఉంటారు. కానీ.. ఈ దున్నపోతు మాత్రం ఎంతో నిబ్బరంగా.. అటూఇటూ చూస్తూ చుట్టుపక్కల పరిసరాలను చాలా అద్భుతంగా ఆస్వాదిస్తున్నట్లు కనిపించడం మీరు చూడోచ్చు. ఏదో వ్యూ పాయింట్ వద్ద నిలబడి నగరాన్ని మొత్తం చూస్తున్నట్లు అది నిలబడిన తీరు స్థానికులను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది..

ఈ విచిత్ర దృశ్యాన్ని చూసిన కొందరు స్థానికులు ఆశ్చర్యంతో తమ మొబైల్ ఫోన్లలో దూరం నుంచి వీడియో తీశారు. అయితే, ఈ వీడియోను సోషల్‌ మీడియాల్లో పోస్ట్ చేయడంతో అది నిమిషాల వ్యవధిలోనే వైరల్‌ అవుతోంది. అంత బరువైన జంతువు నిచ్చెనల వంటి ఇరుకైన మెట్లను ఎక్కి అంత పైకి ఎలా చేరుకుంది..? పైకి వెళ్లేందుకు ఎవరు దారి చెప్పారు? అనే ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి..

అయితే, ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆసక్తికరమైన కామెంట్లతో స్పందిస్తూ వస్తున్నారు. బాహుబలి దున్నపోతు అంటే ఇదేనేమో.. అంటూ.. భూమిపై బోర్ కొట్టి కాసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి పైకి ఎక్కినట్లుంది.. అంటూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అయితే, అంత ఎత్తు నుంచి అది సురక్షితంగా కిందకు దిగిందా లేదా అనే విషయం ఇంకా తెలిదు.. ఈ వీడియో చూసిన వారు AI వీడియో అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు..

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by official Azad Khan (@azadkhan44546)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Trending News
Telugu News