SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అక్టోబర్ 26 నుంచి బుధుడి వక్రగతి.. ఈ 4 రాశులకు గోల్డెన్‌ జాక్‌ఫాట్, బంపర్‌ లాభాలు!

Mercury Retrograde Effect On Zodiac: అక్టోబర్ 26వ తేదీన బుధుడు వక్రగతిలోకి ప్రవేశించబోతున్నాడని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు.. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయన తెలుపుతున్నారు. అయితే, ఏరాశుల వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 27, 2026, 10:06 AM IST | Updated: Sep 27, 2026, 10:09 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Mercury Retrograde Effect On Zodiac News: బుధ గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. దీనిని సంభాషణతో పాటు వ్యాపారాలు లెక్కలు వృత్తికి అధిపతిగా సూచిస్తూ ఉంటారు. అక్టోబర్ 26వ తేదీన బుధుడు తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. 26 డిగ్రీల కోణంలో వక్రగతిలో ఈ సంచారం చేయబోతున్నాడని ఆయన అన్నారు. దీని ఫలితంగా నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో సంభాషణ నైపుణ్యం పెరిగి ఉద్యోగాల్లో విజయాలు సాధించగలుగుతారట. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఆయన అంటున్నారు. ఇక సమయం వృధా చేయకుండా జీవితంలో ముందడుగు వేయడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో తెలుసుకోండి.


మేషరాశి 
అక్టోబర్లో బుధుడు వక్రగతిలోకి వెళ్ళబోతున్నాడు.. కాబట్టి మేషరాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. గొప్ప పురోగతి లభించడమే కాకుండా ఎంతో కాలంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో వృద్ధ లభించడమే కాకుండా ఉద్యోగంలో సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు లభించి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక మెరుగుదల కనిపించి విశేషమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు..

కర్కాటక రాశి 
బుధుడు వక్రగతిలోకి వెళ్లడం కారణంగా కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి సంభాషణ నైపుణ్యం విపరీతంగా పెరుగుతుంది. అలాగే పనుల్లో పెద్ద పదవులను కూడా పొందగలుగుతారు. కొత్త బాధ్యతలు లభించి వీరు ఊహించని స్థాయిలో సెటిల్ అవుతారు. కొత్త ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయి. అంతే కాకుండా కొత్త ఒప్పందాలతో జీవితాన్ని ముందుకు నడిపిస్తారు.

కన్య రాశి 
కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. బుధుడు వక్రగతిలో ఉండడం కారణంగా కన్యా రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో కొత్త స్థానాలకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారాల్లో వృద్ధు లభించడమే కాకుండా కొత్త పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే కొత్త ప్రాజెక్టులు లభించడమే కాకుండా ఈ సమయంలో డబ్బు గురించి చింతలు తొలగిపోయి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అంతేకాకుండా అనేక ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

కుంభరాశి 
బుధ గ్రహం తిరోగమనం కారణంగా కుంభరాశి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే వ్యక్తులకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అలాగే కొత్త ఆదాయ మార్గాలు కూడా పొంది.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారు. ఈ సమయంలో ఉద్యోగాల్లో జీతాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి.. అనేక రకాల సమస్యలు పరిష్కారమై.. కుటుంబంలో మంచి రోజులు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ నుంచి స్వీకరించి రాసింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు. ఇది మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES