Mercury Rise 2026: నవగ్రహాలలో అత్యంత కీలకమైన బుధ గ్రహం గమనంలో మార్పులు రాబోతున్నాయి.. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, వాక్చాతుర్యంతో పాటు తర్కం, వ్యాపారం, వృత్తి నైపుణ్యాలకు అధిపతిగా చెప్పుకుంటారు. డిసెంబర్ 13 వరకు బుధుడు ఉదయించే దశలో ప్రయాణించబోతున్నాడని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. రాబోయే ఈ 21 రోజుల పాటు ద్వాదశ రాశులలోని ఐదు రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందట. ముఖ్యంగా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అదృష్టం పొందే ఆ రాశులు ఇవే:
మకర రాశి:
మకర రాశి ఉద్యోగులకు కార్యాలయంలో పైఅధికారులు, బాస్ నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. సమాజంలో, పనిచేసే చోట మీ గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకు భారీ ప్రాజెక్టులు లేదా కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నూతన ఆదాయ మార్గాలు కూడా చాలా వరకు తెరుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
కన్య రాశి:
రాబోయే 21 రోజులు కన్యా రాశి వారికి స్వర్ణయుగమనే భావించవచ్చని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. మీలో నిర్ణయాధికారం విపరీతంగా పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితులను సైతం ఎంతో సులభంగా అధిగమించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైన ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి.
తులా రాశి:
ఈ రాశి వారికి వృత్తి జీవితంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న అనేక రకాల అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగ మార్పు కోరుకునే వారికి గుడ్ న్యూస్ కూడా సులభంగా లభిస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి..
కుంభ రాశి:
బుధోదయం కుంభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారు లాభదాయకమైన ఒప్పందాలు కూడా లభిస్తాయి. మీ సంభాషణ నైపుణ్యం మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగులకు కూడా ఈ సమయంలో బోలెడు ధన లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మిథున రాశి:
బుధుడి ప్రభావంతో ఈ మిథున రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంది. కార్యాలయాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు కొత్త కస్టమర్లు పెరగడంతో అద్భుతమైన ఆదాయం కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి.
NOTE: