SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shani Dev: అక్టోబర్ 9 నుంచి శని నక్షత్ర సంచారం.. ఈ 3 రాశులకు బంపర్ జాక్పాట్!

Saturn Nakshatra Transit 2026: అక్టోబర్ 9వ తేదీన శని తన సొంత నక్షత్రం గా భావించే ఉత్తరాభాద్ర పాద నక్షత్రం లోకి ప్రవేశించబోతోంది.. దీని కారణంగా రాబోయే సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ వరకు శని ప్రభావం కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకువస్తుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. దీని కారణంగా ఆయారాశుల వారికి ఊహించని జాక్పాట్ లభిస్తుందని ఆయన అన్నారు.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 26, 2026, 09:53 AM IST | Updated: Sep 26, 2026, 09:55 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Saturn Nakshatra Transit 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని అన్ని గ్రహాల కంటే చాలా శక్తివంతమైనదిగా.. ప్రభావవంతమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. శని మార్పుల కారణంగా మొత్తం ప్రపంచంలో మార్పులు రావడమే కాకుండా అన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే శని అక్టోబర్ 9వ తేదీన ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. 2027 ఫిబ్రవరి 8వ తేదీ వరకు అదే నక్షత్రంలో కొనసాగుతూ ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలుపుతున్నారు. శని తన సొంత నక్షత్రంగా భావించే ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి వెళ్లడం చాలా శుభ్రమని ఆయన తెలుపుతున్నారు. ఈ సమయంలో మూడు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని. వారు చేసిన ప్రతి పనిలో తప్పకుండా సక్సెస్ లభిస్తుందని ఆయన చెబుతున్నారు. అయితే ఏ రాశుల వారికి ఎక్కువగా మేలు జరుగుతుందో? అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశులేవో తెలుసుకోండి.

ఈ రాశుల వారికి బంపర్ జాక్పాట్..
వృషభ రాశి 
పవర్ఫుల్ శని తన సొంత నక్షత్రంగా భావించే ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి వెళ్లడం కారణంగా వృషభరాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతూ ఉన్నారు. వీరికి డబ్బు సంపాదించడానికి అద్భుతమైన కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని ఆయన చెబుతున్నారు. వీరికి తప్పకుండా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గతంలో నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభించడమే కాకుండా కొత్త కొత్త ఆధార్ వనరులు పొందగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మకర రాశి 
శని మకర రాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటిది వీరికి కూడా శని నక్షత్ర సంచారంతో అద్భుతమైన విజయాలు కలుగుతాయి. ముఖ్యంగా సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. వృత్తిలో అద్భుతమైన పురోగతి లభించి కొత్త కొత్త మార్గాలు పొందగలుగుతారు. ఎప్పటినుంచో వ్యాపారాలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి అద్భుతమైన అవకాశాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం కూడా లభించబోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో సంభాషణలు జరిపి పరిచయాలు కూడా ఏర్పరచుకుంటారు. దీని కారణంగా ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మెరుగుపడతాయి. ముఖ్యంగా సమాజంలో గౌరవం కూడా ఊహించని స్థాయిలో లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

కుంభరాశి 
ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి శని ప్రవేశించడం వల్ల కుంభ రాశి వారికి కూడా చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి కూడా వ్యక్తిత్వ జీవితంలో విశేషమైన లాభాలు కలుగుతాయి. వీరు ఈ సమయంలో ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి.. వారి నుంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణ నెలకొంటుంది. ప్రేమ వివాహాలు జరగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా.. తప్పకుండా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పాత పరిచయాలనుంచి పూజ విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పనుల్లో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు చాలా వరకు నెరవేరుతాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

NOTE: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యులు నాగరాజు శర్మ నుంచి స్వీకరించి రాసింది.. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధృవీకరించదు. అలాగే ఇది కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధృవీకరించదు..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES