అక్టోబర్ 31 వరకు నీచభంగ రాజయోగం.. ఈ 4 రాశులకు ఊహించని ధనలాభాలు, బంపర్ జాక్‌పాట్!
Neecha Bhanga Raja Yoga Effect On Zodiac: అక్టోబర్ 31వ తేదీ వరకు నీచ భంగ రాజయోగ ప్రభావం ఈ క్రింది రాశుల వారిపై కొనసాగుతూ ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనుకున్న దానికంటే ఎక్కువగా ధన లాభాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు.
Neecha Bhanga Raja Yoga Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు మార్పులకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సెప్టెంబర్ 12వ తేదీ కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే కర్కాటక రాశిలో ఉన్న గురుడు అక్టోబర్ 31 వరకు అదే రాశిలో కొనసాగుతూ ఉంటాడు. దీని ఫలితంగా కుజ గురు గ్రహాల సంయోగం జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన నీచభంగ రాజయోగం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగాను.. గురుడు ఉచ్చస్థితిలో కొనసాగుతూ ఉండడం విశేషం.. అయితే, గురుడి బలమైన స్థానాన్ని కుజుడి బలహీనతను తగ్గించి.. ఎంతో శక్తివంతమైన నీచభంగా రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా అక్టోబర్ నెలలో కొన్ని రాశుల వారికి డబ్బుతో పాటు వృత్తి, వ్యాపారంపరంగా విశేషమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఒక గ్రహం నీచ రాశిలో ఉన్నప్పుడు.. దాని బలహీనత ప్రభావం మరొక గ్రహం కారణంగా తగ్గితే.. ఆ సమయంలో తప్పకుండా యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో ఏర్పడిన యోగ ప్రభావంతో ఏ రాశుల వారికి ఎక్కువగా మేలు జరుగుతుందో.. జ్యోతిష్యులు నాగరాజు శర్మ అందించిన వివరాల ప్రకారం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభరాశి
కుజుడి సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఎక్కువగా మేలు జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా వ్యాపారవేత్తలకు కొత్త పరిచయాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ముఖ్యంగా ఈ సమయంలో ఊహించని మార్పులు రావడమే కాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులందరికీ కొత్త అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు నాగరాజు శర్మ సూచిస్తూ ఉన్నారు.
కన్యారాశి
కన్యా రాశి వారికి కూడా ఎన్నో రకాల ఆర్థిక విషయాల్లో నీచభంగా రాజయోగం కారణంగా మార్పులు రాబోతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకోవడమే కాకుండా గతంలో చేసిన ఎలాంటి ప్రయత్నాలు అయినా తప్పకుండా ఫలిస్తాయి. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చి.. అద్భుతమైన శుభవార్తలు వినగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, ఆర్డర్లు కూడా లభించబోతున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి నెట్వర్క్ బాగా బిల్డ్ అవుతుంది. దీంతోపాటు అనుకున్న పనులు వెంటనే చేయగలిగి ఊహించని విజయాలు సాధించగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సరైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు.
ధనస్సు రాశి
కుజ గురు గ్రహాల కలయిక ధనస్సు రాశి వారికి అద్భుతమైన లాభాలను అందించబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల విషయంలో ఊహించని మార్పులు కూడా వస్తాయి. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న వ్యక్తులకు విశేషమైన లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పరిశోధనలు చేస్తున్న వ్యక్తులకు తప్పకుండా సక్సెస్ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కూడా పరిస్థితులు ధనస్సు రాశి వారికి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, వీరు వాహనాలు నడిపే క్రమంలో, ముఖ్యంగా పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
కుంభరాశి
కుంభరాశి వారికి శని గ్రహం అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటుందని మనందరికీ తెలుసు.. అయితే, ఈ నీచభంగా రాజయోగం కారణంగా కుంభరాశి వారికి కూడా మేలు జరగబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఆన్లైన్ వ్యాపారాలతో పాటు వాణిజ్యం, ప్రయాణాల్లో చాలా వరకు కలిసి రాబోతోందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రంగాల్లో ఉన్నవారు ఈ సమయంలో తప్పకుండా కష్టపడి పనులు చేస్తే విజయాలు సాధించగలుగుతారని ఆయన తెలుపుతున్నారు. కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం లభించడమే కాకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులందరికీ మంచి కంపెనీల నుంచి ఆఫర్లు కూడా లభించబోతున్నాయి. ఏవైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు రిస్క్ ను ఆలోచించి ముందుకెళ్లడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
నోట్.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం సాధారణ నమ్మకాలతో పాటు జ్యోతిష్యులు అందించిన వివరాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధ్రువీకరించదు.