SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అక్టోబర్ వీక్లీ రాశిఫలాలు.. ఈ 4 రాశులకు రాజయోగం.. ఉద్యోగం, వ్యాపారంలో జాక్‌పాట్!

October 19 To 25 Weekly Horoscope: అక్టోబర్ 25వ తేదీ వరకు దాదాపు ఏడు రోజులపాటు ఏర్పడే శక్తివంతమైన యోగాలతో కొన్ని రాశుల వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి కోరుకుంటున్న కోరికలు నెరవేరడమే కాకుండా... అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 18, 2026, 05:55 PM IST | Updated: Oct 18, 2026, 05:57 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

October 19 To 25 Weekly Horoscope: అక్టోబర్ నెలలో మరో కొత్త వారం ప్రారంభం కాబోతోంది. 19 నుంచి 25వ తేదీ వరకు ఈ కొత్త వారం ఉండబోతోంది. అయితే అన్ని వారాలతో పోలిస్తే దీనికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. శాస్త్రం పరంగా ఈ వారం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉండి.. కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు తీసుకురాబోతోందని ఆయన అన్నారు.. ఈ వారంలో రాబోయే ఏడు రోజులు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.. ముఖ్యంగా ఈ సమయాల్లోనే అమ్మవారి శరన్నవరాత్రులు కూడా ముగుస్తాయి.  అష్టమి నవమి దసరా శుభ యోగాలతో ఈ వారం ఉండబోతోంది.. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారికి రాజయోగాల ప్రభావంతో ఎంతో కలిసి రాబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారాలపరంగా కొన్ని రాశులకు ఇది లాభదాయకంగా ఉంటుంది.


ఈ వారంలోనే ఎంతో శక్తివంతమైన సర్వార్థసిద్ధి యోగం, రవి యోగాలతో పాటు.. లక్ష్మీనారాయణ రాజయోగం ముఖ్యంగా బుధాదిత్య రాజయోగం, గజకేసరి రాజయోగాల ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. దీంతో ఈవారం కొన్ని రాశుల వారికి కొత్త అవకాశాలు లభించడమే కాకుండా ఉద్యోగాలు వ్యాపారాలు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ చెబుతున్నారు. ముఖ్యంగా కెరీర్ పరంగా అద్భుతమైన మెరుగుదల కూడా కనిపించబోతోందట..

మేషరాశి 
అక్టోబర్ నెలలోని 19 నుంచి 25వ తేదీ వరకు ఏడు రోజుల పాటు మేష రాశి వారికి వృత్తిపరమైన జీవితంలో చాలా ముఖ్యమైన అవకాశాలు రావచ్చు. పనుల్లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా పై అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంసలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు లభించడమే కాకుండా ఆర్థిక విషయాల్లో అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా పనులు చేస్తున్న వ్యక్తులకు ప్రతిఫలం అద్భుతంగా లభించబోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు.

మిధున రాశి 
అక్టోబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రాబోయే ఏడు రోజులపాటు వీరికి ఈ ముఖ్యమైన యోగాలతో అద్భుతమైన పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి. కొత్త వ్యాపార ప్రతిపాదనలు రావడమే కాకుండా ఉద్యోగ సంబంధిత సమస్యల నుంచి కూడా విముక్తి లభించబోతోంది. అలాగే ఈ సమయంలో ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు కూడా ఏర్పరచుకుంటారు. ఏదైనా ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా పెట్టే అవకాశాలున్నాయి. కానీ షరతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. విజయదశమి పండగ సందర్భంగా వీరు కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిదట..


సింహరాశి 
అక్టోబర్ 25వ తేదీ వరకు ఏడు రోజులపాటు సింహ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు. వీరికి సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. ఈ అధికారులతో సంబంధాలు మరింత మెరుగుపడి కొత్త కొత్త పనులు చేయగలుగుతారు.. పెండింగ్లో ఉన్న పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంభాషణలు ఏర్పడి.. ఉన్నతంగా రాణించగలుగుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. వీరికి ఆదాయం పరంగా కూడా ఎన్నో రకాల లాభాలు చేకూరుతాయి. సహనంగా ముందుకు నడవడం కారణంగా కెరీర్ పరంగా అద్భుతమైన లాభాలు పొందుతారు..

మకర రాశి 
మకర రాశి వారికి అక్టోబర్ 25వ తేదీ వరకు ఏడు రోజులపాటు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగాలపరంగా అనుకున్నా లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం వ్యాపారం ఆస్తి సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక ప్రణాళికల తో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం వల్ల దిమ్మతిరిగే ధన లాభాలు పొందుతారు. దసరా సందర్భంగా కొత్త ఉద్యోగాల్లో చేరాలని అనుకుంటున్న వ్యక్తులకు.. ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెగుతూ వస్తున్నారు..
 

గమనిక..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES