• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అక్టోబర్‌లో శుక్రుడు, బుధుడు, గురుడి ప్రభావం.. ఈ 5 రాశుల వారికి ఆర్థిక లాభాలు!

అక్టోబర్‌లో శుక్రుడు, బుధుడు, గురుడి ప్రభావం.. ఈ 5 రాశుల వారికి ఆర్థిక లాభాలు!

October 2026 Horoscope: అక్టోబర్‌ నెలలో కొన్ని ప్రధాన గ్రహ సంచారం చేయబోతున్నాయని.. ఈ సమయంలో కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 30, 2026, 10:06 AM IST|Updated: Sep 30, 2026, 10:08 AM IST
joinshare
అక్టోబర్‌లో శుక్రుడు, బుధుడు, గురుడి ప్రభావం.. ఈ 5 రాశుల వారికి ఆర్థిక లాభాలు!
Image Credit: జీ తెలుగు న్యూస్

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

October 2026 Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా అక్టోబర్‌ నెలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని.. ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాలు సంచారం చేయబోతున్నాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావురి నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా శుక్రుడి వక్రగతి కూడా ఈ నెలలో ఉండడంతో పాటు గురుడు కూడా సంచారం చేయ్యడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ముఖ్యంగా ఈ అక్టోబర్‌ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు వేర్వేరు సమాయాల్లో సంచారం చేయబోతున్నాయి. దీని ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుందని.. ముఖ్యంగా అక్టోబర్‌ నెలలో శుక్రుడి సంచారంతో కొన్ని రాశులవారికి ప్రేమ, వివాహం, కళ వంటి అంశాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో తప్పకుండా పాత సంబంధాలతో పాటు కొనుగోళ్లు, ఖర్చులు, ఆర్థిక విషయాలు వంటి అంశాల్లో తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది.

అక్టోబర్ 17న ఎంతో శక్తివంతమైన గ్రహంగా పరిగణించే సూర్యుడు కన్యారాశిని విడిచి తులారాశిలోకి సంచారం చేయబోతోంది.. జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహాన్ని ఆత్మవిశ్వాసంతో పాటు హోదా, ప్రతిష్ట, నాయకత్వానికి సూచికగా చెప్పకుంటారు. అలాంటి ఈ గ్రహ సంచారం జరగడం చాలా విశేషమని నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

ఈ సమయంలో ఉద్యోగంలో బాధ్యతపరంగా అనేక మార్పులు వస్తాయి.. అంతేకాకుండా ఉద్యోగుల పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారవేత్తలు భాగస్వామ్యాల విషయంలో బోలెడు ప్రయోజనాలు పొందుతారు. అయితే, ఈ సమయంలో తప్పకుండా లావాదేవీలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

అక్టోబర్ 24వ తేదిన బుధుడు వక్రగతిలోకి సంచారం చేయబోతున్నాడు.. వక్రగతి ప్రభావంతో ఈ సమయంలో కొన్ని రాశులవారికి తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారంతో పాటు రచన పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో, ఇమెయిల్స్‌తో పాటు ముఖ్యమైన పత్రాలు, ఆన్‌లైన్ చెల్లింపులు, ఒప్పందాల విషయంలో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

అక్టోబర్ 31న గురు గ్రహం
అక్టోబర్ 31న అత్యంత శుభప్రదమైన గురుగ్రహం కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి సంపదతో పాటు వివాహం, పిల్లల విషయాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే, ఈ నెలలో ఎక్కువగా అక్టోబర్ నెలలో మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు తప్పకుండా అద్భుతమైన లాభాలు కూడా సొంతం చేసుకుంటారని నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:
Daily Horoscope
Telugu Astrology
Telugu Rasi Phalalu