SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Pitru paksham 2026: కలలో కాకులు కన్పిస్తున్నాయా..?.. దాని సంకేతం ఏమిటి..?.. పితృపక్షంలో ఏమిచేయాలంటే..?..

Crow significance in pitru paksham 2026: చాలా మంది ఈ పదిహేను రోజుల పాటు తమ పూర్వీకులకు శ్రాద్దకర్మాదికాలు చేస్తారు. అంతే కాకుండా చనిపోయిన వారి పేరుమీద దానధర్మాలు చేస్తారు. అయితే ఈ కాలంలో కనుక కాకులు కలలో కన్పిస్తే తప్పకుండా దాని సంకేతం ఇదేనని పండితులు చెబుతున్నారు.

Written By Inamdar Paresh
Published: Sep 25, 2026, 07:18 PM IST | Updated: Sep 25, 2026, 07:29 PM IST
Image Credit: crow(file)
Join

Pitru paksha 2026 crow in dream effect:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం ఈసారి భాద్రపద మాసంలో 2026లో పితృపక్షం సెప్టెంబర్ 26 పౌర్ణమితో ప్రారంభమై సర్వ పితృ అమావాస్యతో ముగుస్తుంది. దీనిని మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ పదిహేను రోజుల పాటు చాలా మంది చనిపోయిన తమ పూర్వీకులకు వారి వారి తిథులను బట్టి శ్రాద్దకర్మలు నిర్వహిస్తారు. నదీస్నానం, బ్రాహ్మణులకు దాన , ధర్మాలు చనిపోయిన వారికి ఇష్టమైన పదార్థాలను ఇస్తారు. ఇలా చేస్తేవారి ఆత్మకు శాంతి దొరుకుతుందని అనాదీగా నమ్ముతారు. 

ఈ క్రమంలో పిండప్రదానం లేదా స్వయంపాకం దానం, చివరకు సాహిత్యదానం అయిన చేయాలని చెబుతారు. అయితే..ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన వారి పూర్తికులు భూమి మీదకు వస్తారని, తమ వారు చేసేశ్రాధ్దకర్మాదికాల కోసం ఎదురు చూస్తారని చెబుతారు. అయితే కొంత మందికి కలలో కాకులు కనిపిస్తుందని చెబుతారు.

కాకులు కన్పిస్తే చనిపోయిన వారికి శ్రాద్దకర్మలు తప్పనిసరి చేయాలి. వారు ఏదో తీరని కోరికలతో బాధపడుతున్నారని అర్థం. కాకులు ముడితేనే మనంచేసే శ్రాద్దకర్మలు పూర్వీకులకు అందినట్లు చాలా మంది విశ్వసిస్తారు. 

అలాంటి కాకి కలలో కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి పూర్తికులకు మాత్రం తగిన విధంగా శ్రాద్దకర్మలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఈ పదిహేను రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు. కేవలం పూర్వీకులకు సంబంధించిన క్రతువులు మాత్రమే చేయాలని పండితులు చెబుతున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES