SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బుధాదిత్య రాజయోగంతో భారీ ప్రయోజనాలు.. ఈ 3 రాశులవారికి ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

Budhaditya Raj Yoga 2026 Effect on 3 Lucky Zodiac Signs: బుధాదిత్య రాజయోగం ప్రభావం నవంబర్‌ 16వ తేది వరకు కొనసాగుతుంది. అప్పటి వరకు కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఏయే రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 10, 2026, 08:55 AM IST | Updated: Nov 10, 2026, 08:56 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Budhaditya Raj Yoga 2026: దీపావళి రోజున ఏర్పడిన బుధాదిత్య రాజయోగం ప్రభావం దాదాపు వారం రోజుల పాటు అన్ని రాశులవారిపై కొనసాగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగానే ఈ వారం కూడా కొన్ని రాశులవారికి చాలా లాభదాయంగా ఉంటుంది. అంతేకాకుండా తెలివితేటలు, పురోగతి, గౌరవం వంటి అంశాల్లో కూడా కీలక మార్పులు వస్తాయి. ఆర్థిక పరంగా కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరబోతున్నాయి.

సూర్యుడితో పాటు బుధుడు ఒకే రాశిలో కలయిక జరిపినప్పుడు ఈ శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, ప్రతిష్టతో పాటు ప్రభుత్వ రంగానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. మరోవైపు.. బుధుడు తెలివితేటలతో పాటు వాక్చాతుర్యం, వ్యాపారం, అకౌంటింగ్‌లకు సూచికగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడిన ఈ యోగం వృత్తితో పాటు వ్యాపారానికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ నవంబర్‌ 16వ తేది వరకు ఈ యోగం కొనసాగుతుందట.. కాబట్టి అప్పటి వరకు కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతూనే ఉంటాయి.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
తులారాశి
ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగంతో తులారాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనుల్లో శుభవార్త కూడా పొందుతారు. మీ పనులకు కార్యాలయంలో అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వ్యాపారవేత్తలు కొత్త కస్టమర్ లేదా పెద్ద కాంట్రాక్టుల నుంచి లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. ఆర్థిక వ్యాపారాలు కూడా విజయవంతమయ్యే ఛాన్స్‌లు కనిపిస్తుంది..

మేష రాశి
దీపావళి రోజు నుంచి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి.. పని చేసే చోట మీ పనికి తగిన ప్రశంసలు కూడా తప్పకుండా లభించబోతున్నాయి. వీరికి తప్పకుండా కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు కూడా తప్పకుండా లభించబోతున్నాయి.

కన్యారాశి
ఈ రాజయోగం కన్యారాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి జ్ఞానంతో పాటు వివేకం కూడా పెరిగి.. కొన్ని నిర్ణయాలు పనిలో వీరికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఊపందుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం కూడా లభిస్తోంది. అలాగే, కొత్త ఆదాయ వనరులు కూడా సులభంగా లభిస్తాయి. 

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES