SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవపంచమ రాజయోగం ఎఫెక్ట్‌తో.. అక్టోబర్ 16 నుంచి ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే కాలమా?

Saturn-Mars Navpancham Rajyog Telugu News: అక్టోబర్ 16న 120 డిగ్రీల కోణంలోకి శని, కుజ గ్రహాలు రావడం వల్ల ఏర్పడే నవపంచమ రాజయోగం ఎఫెక్ట్‌తో ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 09, 2026, 09:40 AM IST | Updated: Oct 09, 2026, 09:41 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Saturn-Mars Navpancham Rajyog: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కదలికలతో పాటు వాటి సంయోగాలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. నిర్దష్ట సమయాల్లో గ్రహాల అనుకూల స్థానాల్లో ఏర్పడే అద్బుతమైన యోగాల కారణంగా మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్‌ నెల గ్రహ శుభ స్థానాలకు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ముఖ్యంగా అక్టోబర్‌ 16వ తేదిన 120 డిగ్రీల కోణంలోకి శని, కుజుడు రాబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన నవపంచమ రాజయోగం కూడా ఏర్పడబోతోంది. ఈ శుభ దృష్టి వల్ల ఏర్పడే యోగంతో కొన్ని రాశులవారికి అదృష్టం ఊహించని స్థాయిలో పెరగబోతోంది. ముఖ్యంగా ఆర్థికంగా, కెరీర్‌ పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి.

నవపంచమ రాజయోగం అంటే ఏమిటి?
జాతక చక్రంలో రెండు గ్రహాలు తొమ్మిదవ, ఐదవ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ ఎంతో శక్తివంతమైన నవపంచమ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. పంచమ స్థానం బుద్ధి, విద్యకు సూచికగా భావిస్తూ ఉంటారు. అయితే, నవమ స్థానాన్ని అదృష్టం, ధర్మం, ఆధ్యాత్మికతకు సూచికంగా చెప్పుకుంటారు. అయితే, ఈ యోగం కొన్ని రాశులవారికి గోల్డెన్‌ డేస్‌ తీసుకు రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా దిమ్మతిరిగే ధన లాభాలను కూడా అందిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి అద్భుతమైన లాభాలు:
మేష రాశి:
నవపంచమ రాజయోగ ప్రభావంతో ఈ మేష రాశివారికి చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో తప్పకుండా ఉన్నత పదవులు కూడా లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తప్పకుండా వీరు అద్బుతమైన ఇంక్రిమెంట్లు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.. పూర్వీకుల ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం కూడా కాబోతున్నాయి..

సింహ రాశి:
ఎంతో శక్తివంతమైన ఈ యోగంతో సింహ రాశివారికి ఆర్థికంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాల పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇటీవలే పెట్టిన పెట్టబడుల నుంచి కూడా భారీ మొత్తంలో లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. అలాగే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటారు. సమాజంలో ఊహించని గౌరవ మర్యాదలు కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు రాశి:
ఈ యోగంలో ధనుస్సు రాశి వారికి కూడా బోలెడు ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో కొన్ని పనుల్లో అనుకోని ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా అప్పుల బాధ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి బంపర్ ప్రయోజనాలు చేకూరే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. 

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES