SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

శని నక్షత్ర సంచారంతో 107 రోజుల పాటు అదృష్టం? ఈ 4 రాశులవారికి జాక్‌పాట్ టైమ్!

Saturn Nakshatra Transit 2026: శని గ్రహ నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశులవారు 107 రోజుల పాటు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరబోతున్నాయి. అలాగే ఆర్థికంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 26, 2026, 10:17 AM IST | Updated: Oct 26, 2026, 10:20 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Saturn Nakshatra Transit 2026: అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో శని ఒకటి.. ఇది చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహం సంచారం చేస్తే అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావాన్ని చూపుతుంది. ఇదిలా ఉంటే శని గ్రహం అక్టోబర్‌ 24వ తేదిన నక్షత్ర సంచారం చేసింది. శని నక్షత్రంలో మార్పు కారణంగా వృషభ, మిథునతో తుల, మకర రాశులవారికి ఈ సమయం చాలా బాగుంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభించి.. ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. వ్యాపారాలు కూడా చాలా వరకు సక్రమంగా కొనసాగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, అక్టోబర్ 24 నుంచి రాబోయే 107 రోజుల పాటు ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

జ్యోతిషశాస్త్రంలో శనిని పనితో పాటు క్రమశిక్షణ, కఠోర శ్రమ, న్యాయానికి సూచికగా చెప్పుకుంటారు.. ఇదిలా ఉంటే.. శని అక్టోబర్ 9న ఉత్తరాభద్రపద నక్షత్రంలోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇది ఫిబ్రవరి 8 వరకు ఈ నక్షత్రంలోనే సంచార దశలో కొనసాగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. శని ప్రస్తుతం మీనరాశిలో నీచ స్థితిలో కొనసాగుతూ వస్తున్నాడు.. ఈ సమయంలో ఓపికతో పని చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
వృషభ రాశి 
శని గ్రహం నక్షత్ర సంచారం కారణంగా వృషభ రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే పనిలో కొత్త బాధ్యతలు లభించి.. ఊహించని విజయాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు కొత్త కస్టమర్లను పొందడానికి లేదా విస్తరించడానికి అవకాశం తప్పకుండా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ముఖ్యమని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు.

మకర రాశి
మకర రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు తప్పకుండా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి కూడా ఆశించిన లాభాలు వస్తాయి. అయితే, నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.


మిథున రాశి
మిథున రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి చాలా కాలంగా నిలిచిపోయిన పని ఊపందుకునే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. అలాగే వీరికి పై అధికారుల నుంచి సహాయం కూడా తప్పకుండా లభిస్తుంది.. పాత పరిచయాల నుంచి కూడా వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థిక నిర్ణయాల విషయంలో తొందరపడకుండా ముందుకు సాగడం మంచిది..

తులారాశి
తులా రాశివారికి కూడా శని నక్షత్ర సంచారం ఎంతో అద్భుతంగా  ఉంటుంది. వీరికి ఆశించిన లాభాలు కలగడమే కాకుండా పరిస్థితులు చాలా వరకు సహకరించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలను అమలు చేసే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయ వనరులు కూడా భారీ మొత్తంలో లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి.
 

గమనిక..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES