207 రోజుల పాటు అద్భుత శని యోగం.. ఈ 4 రాశులకు బంపర్ లాభాలు!
Saturn Effect 2027: 2027లోని ఫిబ్రవరిలో శని నక్షత్ర సంచారం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో అనేక మార్పులు చేయబోతోంది. దీంతో ఈ కింది రాశులవారికి చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా అనుకున్న ఎలాంటి పనులైనా సులభంగా చేసే అవకాశాలు లభిస్తున్నాయి.
Saturn Effect 2027: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని గ్రహం సంచారాలు, మార్పులు చాలా కీలమైనదిగా భావించవచ్చు.. ఈ గ్రహాల కదలికలు ద్వాదశ రాశుల జీవితాలపై ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ప్రస్తుతం శని భగవానుడు మీన రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాడు. రాబోయే 207 రోజుల్లో శని సంచార ప్రభావంతో పాటు నక్షత్ర మార్పులు కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలను అందిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని దేవుడు 2027 జూన్ 2 వరకు మీన రాశిలోనే సంచార దశలోనే కొనసాగుతాడు. శని స్థానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2026 డిసెంబర్‌లో శని మార్పులు చేర్పులు కూడా చేయబోతోంది.. అనంతరం 2027 ఫిబ్రవరిలో శని నక్షత్ర మార్పు ఉంటుందని జ్యోతిష్యులు వెల్లడించారు. ఆ తర్వాత మార్చి నెలలో అస్తమించి.. తిరిగి మే నెలలో ఉదయిస్తాడు. శని గమనంలో జరిగే ఈ మార్పులు కొన్ని రాశుల వారికి విశేషమైన అదృష్టాన్ని అందిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వీరికి శని అనుగ్రహం..
మిథున రాశి
మిథున రాశివారికి రాబోయే ఏడాది చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. సమాజంలో హోదా, గౌరవ మర్యాదలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కూడా సులభంగా లభిస్తుంది. నూతన ఆస్తులు, సంపద కూడా భారీగా లభించే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు తప్పకుండా పదవులు కూడా సొంతం చేసుకుంటారు.
తుల రాశి
శని పవర్‌ఫుల్ ఎఫెక్ట్‌తో తుల రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభించి అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు. దీర్ఘకాలిక కుటుంబ వివాదాలు కూడా ఈ సమయంలో తప్పకుండా పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి మనశ్శాంతి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడిపే ఛాన్స్‌లు ఉన్నాయి..
మకర రాశి
ఈ 207 రోజులు మకర రాశి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారపరంగా చాలా బాగుంటుంది. నూతన పెట్టుబడులతో పాటు భారీ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి.
కన్య రాశి
కన్య రాశి కూడా ఈ శని ప్రభావంతో ఎన్నో రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారస్తులు మంచి లాభాలు కూడా పొందుతారు. వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక స్థితి క్రమంగా బలపడటంతో పాటు, వృత్తిపరంగా నూతన బాధ్యతలు తప్పకుండా పొందుతారు..
NOTE: