SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

2027లో శని ప్రభావం.. ఈ రాశులవారు జాగ్రత్త!

Saturn Effect: 2027లో శని మార్పులు కొన్ని రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకు వస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా ఈ కింది రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 31, 2026, 11:05 AM IST | Updated: Oct 31, 2026, 11:07 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Saturn Effect: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని అత్యంత కీడు, చెడు గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహం సంచారం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు కొన్ని రాశులవారికి శని మంచి ఫలితాలను కూడా అందిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే 2027లో శని కదలికల కారణంగా కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఏడాది ప్రారంభం నుంచే అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతూ ఉంటాయి. అయితే, శని మార్పు కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు కూడా రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

శని సంచారం ఎప్పుడు?
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2027 సంవత్సరం మొదట్లో శని మీనరాశిలో సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు.. 2027 జూన్ 3వ తేది మీనరాశిలో కదలికలు చేసి సక్రమ మార్గంలో వెళ్తాడు.. దీని ప్రభావం అక్టోబర్ 20 వరకు కొనసాగుతుంది.. ఆ తర్వాత వక్రగతిలో మీనరాశికి తిరిగి వస్తాడు. శని వక్రగతి 2027 ఆగస్టు 9న ప్రారంభమై.. 2027 డిసెంబర్ 24వ తేది వరకు కొనసాగుతాడు.. 2027లో శని గ్రహం అనేక మార్పులు చేయబోతోంది. దీని కారణంగా ఆయా రాశులవారిపై చాలా ప్రభావం పడుతుంది.

ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి..
మేష రాశి: 
జూన్ 2027లో శని మార్పుల కారణంగా మేష రాశివారు చాలా వరకు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని ఫలితంగా.. మేషరాశి వారికి శని అర్ధసతి మధ్య దశ ప్రారంభమవుతుందని నాగరాజు శర్మ చెబుతున్నారు. అందుకే ఈ సమయంలో పనిలో ఒత్తిడి, మానసిక అస్థిరత ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా రెట్టింపు అవుతూ ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా వరకు మానుకోవాల్సి ఉంటుంది.. మీరు ఖర్చుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరమని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వృషభ రాశి: 
వృషభ రాశి వారికి జూన్ నుంచి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. దీని ఫలితంగా.. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండటం అవసరమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనవసరమైన ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి.. పనిలో కష్టపడి పనిచేసినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రావడంలో ఆలస్యం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యక్తిగత సంబంధాలలో కూడా అపార్థాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

కుంభ రాశి: 
2027 సంవత్సరంలో కుంభ రాశి వారికి శని ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. శని అర్ధసతి చివరి దశ ఈ రాశి వారిపై ప్రభావం చూపే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. దీని ఫలితంగానే పనిల్లో తీవ్రమైన ఆటంకాలు కూడా రావచ్చు.. ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. అయితే, ఓపికగా ఉండి.. ముందుకు సాగడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

మీన రాశి: 
శని ప్రభావంతో మీన రాశివారిపై కూడా ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి అనుకున్న పనుల్లో మార్పులు వస్తాయి. పనుల్లో ఊహించని స్థాయిలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. అలాగే మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక ప్రణాళికల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES