Ramayana Run Time: ‘రామాయణ’ సినిమా ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్ మూవీగా 40 భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డేవిడ్ గఫెన్ థియేటర్‌లో ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్..‘Ramayana.. The Rise Of Legend’ పేరుతో ప్రదర్శించారు. దీనికి అపూర్వ స్పందన వచ్చింది. మన ఇతిహాసాల్లోని రామాయణ మహా కావ్యంపై తెరకెక్కిన ఈ సినిమాను అమెరికాలోని ఈ థియేటర్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం. అంతేకాదు ఈ థియేటర్‌లో ప్రదర్శితమైన మొదటి భారతీయ సినిమాగా ‘రామాయణ’ రికార్డులకు ఎక్కింది.
రామాయణ సెన్సార్ రిపోర్ట్..
ఈ సినిమా హిందీలో సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి క్లీన్‘U’సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా నిడివి 195 నిమిషాలు.. అంటే 3 గంటల 15 నిమిషాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో తెలుగు ఇతర రీజనల్ లాంగ్వేజెస్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. ఈ సినిమా డబ్బింగ్ కోసం ఏఐ టెక్నాలజీతో పూర్తి చేయడం విశేషం. మొత్తంగా లిప్ సింక్ కుదిరేలా చేశారు.
‘రామాయణ’ సినిమా రెండు భాగాలు కలిపి రూ. 4 వేల కోట్లతో తెరకెక్కించినట్టు సమాచారం. ఇక మొదటి భాగం రెండు వేల కోట్లు అయినట్టు మేకర్స్ తెలిపారు. ఇక ఇందులో సగం ఇప్పటికే రివకరీ అయింది.
హిందీ రైట్స్..
ఈ సినిమా హిందీ రైట్స్‌ను మన దేశంలో రూ. 250 కోట్లకు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కొనుగోలు చేశాడు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 105 కోట్లకు దిల్ రాజు అడ్వాన్స్ పద్ధతిలో కొనుగోలు చేసినట్టు సమాచారం. కర్ణాటక రైట్స్‌ను యశ్ ఓన్‌గా రిలీజ్ చేసుకుంటున్నాడు. టీ సీరిస్ ఈ సినిమా ఆడియో రైట్స్ కింద రూ. 75 కోట్లను నిర్మాతలకు చెల్లించింది. జియో హాట్ స్టార్ ఈ సినిమా ఓటీటీ, డిజిటల్ శాటిలైట రైట్స్ అన్ని భాషల్లో కలిపి రూ. 450 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా విడుదలకు ముందు నిర్మాతలకు పెట్టిన పెట్టుబడిలో సగం రివకరీ అయింది.