• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • / Pitru paksha 2026: సూసైడ్ లు, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి మహాలయ పక్షాల్లో ఏరోజు పిండ ప్రదానం చేయాలి..?..

Pitru paksha 2026: సూసైడ్ లు, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి మహాలయ పక్షాల్లో ఏరోజు పిండ ప్రదానం చేయాలి..?..

Pitru paksha days: కొంత మంది అనుకొకుండా రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాల్లో చిక్కుకుని చనిపోతారు. మరికొంత మంది సూసైడ్ లు కూడా చేసుకుంటారు. ఇలాంటి వారి ఆత్మలకు అంత ఈజీగా శాంతి ఉండదని పండితులు చెబుతుంటారు.

Written ByInamdar Paresh
Published: Sep 29, 2026, 03:59 PM IST|Updated: Sep 29, 2026, 04:08 PM IST
joinshare
 Pitru paksha 2026: సూసైడ్ లు, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి మహాలయ పక్షాల్లో ఏరోజు పిండ ప్రదానం చేయాలి..?..
Image Credit: pitrupaksha(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pitru paksha pinda pradan rules and tradition: ప్రస్తుతం మనం పితృపక్షంలు జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 26న పౌర్ణమితో పితృపక్షం ప్రారంభమై, అక్టోబర్ 10న సర్వ పితృ (మహాలయ) అమావాస్యతో ముగుస్తుంది. ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులను స్మరించుకుంటూ పిండప్రదానాలు, తిలతర్పణాలు చేయాలి. కనీసం స్వయం పాకం లేదా సాహిత్యం అయిన చనిపోయిన వారి తిథి రోజున ఇవ్వాలి. ఈవిధంగా చేస్తే వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని చెబుతుంటారు. 

ముఖ్యంగా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, గోవులు, పక్షులు, ఇతర జంతువులకు ఆహారం, పేదలకు అన్న, వస్త్రదానాలు చేయడంతో  గతించిన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.  ఏడాదికి ఒక్కసారిపితృ దేవతలు భూమి మీదకు వస్తారని, వారి వంశస్తులు పెట్టే పిండ ప్రదానాలు, తిలతర్పణాల కోసం ఎదురు చూస్తుంటారని  పెద్దలు చెబుతారు. అయితే దీనిని శ్రద్దతో చేసిన వారికి పితృదేవతను ఆశీర్వదించి తమ లోకాలకు వెళ్లిపోతారని అనాదీగా ఈ ఆచారంను పాటిస్తున్నారు.


అయితే.. కొంత మంది ఏదైన ప్రమాదాలు లేదా ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తారు. తమ నూరెళ్ల జీవితంను అర్థంతరంగా ముగించేస్తారు. ముఖ్యంగా ఆత్మహత్య అనేది మహాపాపంగా చెప్తారు. వీరికి అస్సలు శాంతి ఉండదని, జీవచ్చవంలా , కోరికలు తీరక తిరుగుతుంటారని చెబుతారు.  అందుకే ఇలాంటి వారికి మనం   పితృపక్షంలో అనాదీగా ప్రత్యేకంగా ఒక రోజున పిండ ప్రదానం చేయాలని చెబుతుంటారు. దీనిలో పాటు కొన్ని పరిహారాలు కూడా చేయాలని చెప్తారు. దీనిని
పాటిస్తే చనిపోయిన వారికి ముక్తి దొరుకుతుందని చెప్తుంటారు. 

ఆత్మహత్యలు,ఏదేనీ ప్రమాదాలు లేదా ఇతర అపమృత్యువు (అకాల మరణం) చెంది అసహజంగా చనిపోయిన వారిని  చతుర్దశి తిథి రోజున పిండ ప్రదానం చేయాలి. ఈ రోజున పిండ ప్రదానం, తర్పణాలు, దానధర్మాలు చేయడం ద్వారా అశాంతిగా ఉన్న ఆత్మలకు శాంతి, విముక్తి కలుగుతాయని హిందూ ధర్మ శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి.
వీరికి ఇష్టమైన వస్తువులు లేదా పదార్థాలు చేసి దానంగా ఇవ్వాలి.  ఇలా చేస్తే వారి ఆత్మలు శాంతించి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Zodiac Signs
Astrological Remedies