• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవంబర్ 19 నుంచి సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!

నవంబర్ 19 నుంచి సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!

Sun Transit in Anuradha Nakshatra 2026: అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు వెళ్లడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయంలో బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వస్తున్న ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో జ్యోతిష్యులు నాగరాజు శర్మ మాటల్లో తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 18, 2026, 10:00 IST|Updated: Nov 18, 2026, 10:02 IST
joinshare
నవంబర్ 19 నుంచి సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sun Transit in Anuradha Nakshatra 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు.. ఆత్మవిశ్వాసంతో పాటు కీర్తికి కారకుడిగా భావించే సూర్యుడు నవంబర్ 19న నక్షత్ర సంచారం చేయబోతోంది.. శని దేవుని అధిపతిగా ఉండే అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయబోతోంది.. డిసెంబర్ 3 వరకు అక్కడే సంచార దశలో కొనసాగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. సూర్యుడు, శని మధ్య తండ్రీకొడుకుల బంధం ఉన్నప్పటికీ.. వారి మధ్య శత్రుత్వ భావన ఉంటుందట.. అయితే, ఈ రెండు గ్రహాల స్వభావంలో వైరుధ్యం ఉన్నా.. ఈ నక్షత్ర మార్పు అన్ని రాశులవారిపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదట.. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో.. కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బోలెడు ధన లాభాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి లాభాలే, లాభాలు:
మిథున రాశి:
సూర్యుని నక్షత్ర సంచారం మిథున రాశి వారికి అనేక రకాల అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో మీ పనితీరుకు తగ్గట్లు గుర్తింపు లభించి.. కొత్త బాధ్యతలు లభించే ఛాన్స్‌లు తెలుపుతున్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్స్‌ కూడా సులభంగా లభిస్తాయి. పాత అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా సులభంగా బయటపడే ఛాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని విజయాలు సాధిస్తారు.

కన్య రాశి:
కన్య రాశివారికి కూడా ఈ సమయంలో అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు మానసిక ప్రశాంతత కూడా భారీగా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగాల పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మేష రాశి:
అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు వెళ్లడం వల్ల మేష రాశివారికి సమస్యలు తప్పవని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో గతంలో నిలిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. నూతన ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా.. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.

ధనుస్సు రాశి:
అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ధనుస్సు రాశివారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల పరంగా వస్తున్న అనేక రకాల సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి బంపర్‌ లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇళ్లు లేదా భూములు కొనుగోలు చేయాలనుకునేవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. 
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Telugu Rasi Phalalu