ఇంటి గుమ్మం ముందు ఈ 7 మొక్కలు పెంచితే చాలు.. లక్ష్మీదేవి తాండవిస్తుంది, అదృష్టం మీ సొంతం!
చాలామంది ఇంట్లో మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇవి ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. కొన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలతోపాటు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే మొక్కలు కూడా ఉంటాయి. వాస్తు ప్రకారం, ఇంట్లో ఈ ఏడు రకాల మొక్కలను ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెంచుకోవాల్సిన మొక్కలు ఏంటో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని మొక్కలను పెంచడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. సాధారణంగా చాలా ఇళ్లలో తులసి, కలబంద వంటి మొక్కలు ఉంటాయి, వీటిని హిందూమతంలో పూజిస్తారు. వీటితో పాటు మనీ ప్లాంట్ వంటి మరికొన్ని మొక్కలు కూడా ఉంటాయి. అయితే, ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెంచే కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఇంట్లో పాజిటివిటీని పెంచడమే కాకుండా, ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తాయి.
వీటితో పాటు కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇవి గాలిని శుద్ధి చేసి, ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి. ఇవి కేవలం దుర్వాసనను తగ్గించడమే కాకుండా, కార్బన్ డయాక్సైడ్ను కూడా పీల్చుకుని ఒత్తిడిని తగ్గిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో
పెంచుకోవాల్సిన మొక్కల వివరాలు ఇవే:
మనీ ప్లాంట్ అందరికీ తెలిసిందే. ఇది ఇండోర్, అవుట్డోర్ కూడా పెంచగలిగే తీగ మొక్క. దీనిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, ఇంటి చుట్టూ ఉన్న కార్బన్ స్థాయిలను తగ్గించి, శుభాన్ని కలిగిస్తుంది.
అరేకా పామ్ మొక్కను కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెంచుకోవచ్చు. ఇది తేమగా ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఇది ఇండోర్ లేదా అవుట్డోర్ మొక్కగా కూడా ఉపయోగపడుతుంది. దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల సుఖశాంతులు లభిస్తాయి.
స్నేక్ ప్లాంట్ మొక్కకు తక్కువ నీరు అవసరమవుతుంది. దీనిని ఇండోర్ ప్లాంట్గా పెంచుకుంటారు. ఇది రాత్రి సమయాల్లో కూడా గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది.
లక్కీ బ్యాంబూ మొక్క వాస్తు ప్రకారం ఇంట్లో ఉండటం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, అంతేకాకుండా ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. పీస్ లిల్లీ కూడా ఇంట్లో శాంతిని ప్రసాదిస్తుంది. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగి, అందరూ హాయిగా, సంతోషంగా ఉంటారు.
వీటితో పాటు రబ్బర్ ప్లాంట్ మొక్క కూడా ఇంటి అందాన్ని పెంచుతుంది. దీనిని ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసుకుంటే నరదృష్టి తగలకుండా ఉంటుంది. సాధారణంగా పెద్ద ఆకులు ఉన్న మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెంచాలి. వీటితో పాటు మనం అందరం సాధారణంగా పెంచుకునే తులసి మొక్క కూడా చాలా ముఖ్యం.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)