• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /మీ దశ తిరగాలంటే ఇంట్లో ఈ 7 వస్తువులు ఉండాల్సిందే.. మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు! ఈ సీక్రెట్స్ మీకు తెలుసా?

మీ దశ తిరగాలంటే ఇంట్లో ఈ 7 వస్తువులు ఉండాల్సిందే.. మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు! ఈ సీక్రెట్స్ మీకు తెలుసా?

ఎంత కష్టపడినా.. ఒక్కోసారి మనకు కలిసి రాకపోవచ్చు. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ఉంటే అంతా పాజిటివ్‌గానే జరుగుతుంది. అయితే, ఇంట్లో ఈ 7 వస్తువులు ఉంటే మీ దశ తిరుగుతుంది. మీ అదృష్టాన్ని కూడా ఎవరూ ఆపలేరు అని వాస్తు శాస్త్రంలో ఉంది. అవి ఏంటి తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 25, 2026, 09:57 IST|Updated: Nov 25, 2026, 10:00 IST
joinshare
మీ దశ తిరగాలంటే ఇంట్లో ఈ 7 వస్తువులు ఉండాల్సిందే.. మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు! ఈ సీక్రెట్స్ మీకు తెలుసా?
Image Credit: Vastu Shastra Tips:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

2

Delhi: ఢిల్లీలో షాకింగ్ ఘటన..కేఫ్‌లో యువతిపై సాముహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్..

3

డిసెంబర్‌లో ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు!

4

రెగ్యులర్ కథలకు నో చెబుతున్న మిడ్ రేంజ్ కథానాయికలు.. ఢిఫరెంట్ స్టోరీలతో ఇమేజ్ మేకోవర్..

5

డిసెంబర్‌లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్థిక కష్టాలకు చెక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vastu Shastra Tips: వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండే శుభం. వీటివల్ల అదృష్టం కలిసి వస్తుంది. సుకఃసంతోషాలు కూడా ఉంటాయి. వాస్తు నిపుణుల ప్రకారం మీరు సక్సెస్‌ చూడాలంటే ఇంట్లో కొన్ని వస్తువులు కూడా ఉండాలి. ఇవి ఆ ప్రాంతంలో నెగిటివ్‌ ఎనర్జీని తొలగిస్తాయి. ఇంట్లో ధన ప్రవాహం, ఆనందం, వృద్ధి ఉండాలంటే ఈ వాస్తు నియమాలు పాటించండి. డబ్బున్న వారు కూడా వారింట ఈ వస్తువులను తప్పకుండా ఏర్పాటు చేసుకుంటారు.

మనీ ప్లాంట్‌..
ఈ మనీ ప్లాంట్ మొక్క చాలా మంది ఇళ్లలో చూస్తున్నాం. ఇది ఇంటి వాతావరణాన్ని కూడా శుద్ధి చేసే గుణం కలిగి ఉంటుంది. ఈ ఆకులు ఎలా పెరిగితే ఇంట్లో సక్సెస్‌, వృద్ధి కూడా అలా కలిసి వస్తుందంటారు. ఎప్పుడూ ఈ మొక్కను ఈశాన్యం మూలలో ఏర్పాటు చేసుకోండి. దీంతో వ్యాపారంలో కూడా లాభాలు గడిస్తారు. ఆర్థిక లాభాలు కూడా గడిస్తారు.

వాటర్‌ ఫౌంటెన్‌..
ఇంట్లో ఈ వాటర్‌ ఫౌంటెన్‌ ఉంటే ఆర్థిక లాభాలు గడిస్తారు. ఇంట్లో చిన్నపాటి వాటర్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు చేస్తే చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ వాటర్‌ ఫౌంటెన్‌ పెట్టండి. ఎప్పుడూ ఉత్తర దిశగా దీన్ని ఏర్పాటు చేయాలి. ఇంటికి పాజిటివ్‌ ఎనర్జీ లభిస్తుంది. ఇంట్లో ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది.

లాఫింగ్‌ బుద్దా..
లాఫింగ్‌ బుద్దా కూడా అదృష్టం, ఆనందానికి సంకేతం. మూడు కాళ్ల కప్ప కూడా పెట్టుకుంటారు. ఇది కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టండి.  ఇక లాఫింగ్‌ బుద్ధాను ఇంటి డ్రాయింగ్‌ రూమ్‌లో పెట్టొచ్చు. అయితే, నేరుగా కింద, కిచెన్‌లో మాత్రం ఈ ప్రతిమను పెట్టకూడదు. ఇది ఇంటికి పాజిటివిటీ, ఆనందాన్ని పెంచుతుంది.

బియ్యం డబ్బా..
హిందూ మతంలో బియ్యం డబ్బా కూడా కీలకం. అన్నపూర్ణ దేవితో పోలుస్తారు. వాస్తు ప్రకారం ఈ బియ్యం డబ్బా పరిశుభ్రంగా, నిండుగా ఉండాలి.  ఇందులో కొన్ని కాయిన్స్‌, పసుపుకొమ్ము కూడా వేసి పెట్టాలి.  దీనివల్ల ఇంట్లో ఆహారానికి కొరత ఉండదు.

తాబేలు..
ఇంట్లో మెటల్‌ తాబేలును కూడా పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం ఇది స్థిరత్వం, అభివృద్ధికి సూచిక. కష్టాలను తొలగిస్తుంది. ఆర్థిక పరిస్థితులను మెరుగు చేస్తుంది. చిన్న కంటైనర్‌లో నీరు పోసి ఈ మెటల్‌ తాబేలును ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర దిశగా ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల ఇంటి పెద్ద ఆయుష్షు కూడా పెరుగుతుంది. వ్యాపారంలో కూడా స్థిరమైన లాభాలు పొందుతారు.

క్రిస్టల్‌ బాల్‌..
క్రిస్టల్‌ బాల్‌ కూడా పాజిటవ్‌ ఎనర్జీకి సూచిక. ఇంట్లో నెగిటివిటీని తొలగిస్తుంది. డ్రాయింగ్‌ రూమ్‌, వర్క్‌స్పేస్‌లో ఏర్పాటు చేసుకుంటే సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది.

కుబేర ప్రతిమ..
ఇంట్లో ఈ ప్రతిమ కూడా ఉండాల్సిందే. కుబేరుడి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. దీంతో కూడా ధనాకర్షణ పెరుగుతుంది.  కుబేరుని ఇంట్ఇ ప్రధాన ద్వారం లేదా పూజగదిలో కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా సంతోషానికి ప్రతీక.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology